Guppedanta Manasu 1 Oct Episode : దేవయానికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన మహీంద్రా.!? రిషి కమాండ్ చేసిన వసుధర..

Guppedanta Manasu 1 Oct Episode : సార్ మన మధ్య అభిప్రాయ బేధాలు వస్తాయి అలా అని వాటి గురించి ఆలోచిస్తూ ఉండం కదా అని వసుధర అంటాడు.. అప్పుడే మహీంద్రా వచ్చి మినిస్టర్ గారు రమ్మన్నారు అని చెబుతాడు.. సరే డాడ్ బయలుదేరతున్నం అని అంటాడు.. రిషి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా వసుధర రిషి చేతిని పట్టుకుని కార్ దిగండి సార్ అంటుంది.. హేయ్ ఏమైంది నీకు అని రిషి అంటాడు.. దిగండి సార్ అని వసుధర అంటుంది..

వసుధర రిషి చేయి తీసుకుని క్లీన్ చేస్తుంది.. తన చేతికి బ్యాండేజ్ వేస్తుంది రిషి చేయని పట్టుకొని ఈ చెయ్యే నాకు కాలేజీలో సీటు వచ్చేలా చేసింది.. ఈ చెయ్యే నన్ను యూత్ ఐకాన్ ను అయ్యేలా ఎంకరేజ్ చేసింది.. ఈ చెయ్యే నన్ను నడిపించింది.. చూడు వస్తారా చేతికి అయిన గాయం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది.. మచ్చ కూడా కొన్నాల్టికి పోతుంది.. కానీ మనసుకి అయిన గాయం మాత్రం ఎప్పటికీ పోదు.. కానీ ఆ నొప్పి బాధ ఏంటో నాకు తెలుసు.. రిషిధర అయిన మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నే వెతుక్కుంటుంది పదండి సార్ వెళ్దాం అని వసుధర కార్ లో ఎక్కి కూర్చుంటుంది..

రిషి వసుధర చలా మంచి అమ్మాయి.. రిషి వసుధర కు నీ జాబు కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు.. కానీ తనే పట్టుబట్టి మరి ఈ జాబ్ లో జాయిన్ అయింది అని మినిస్టర్ చెబుతాడు.. కానీ రిషి కి వసుధర ఇంకోలాగా చెప్పింది.. అందుకని రిషి వసుధార వైపు అదోలాగా చూస్తాడు.. సివిల్స్ వెళ్ళినా కూడా ఈజీగా పాస్ అవుతుంది అని మినిస్టర్ అంటాడు.. రిషి వసుధారా లాంటి మంచి అమ్మాయిని నువ్వు ఎప్పటికీ వదులుకోవద్దు అని మినిస్టర్ అంటాడు ఏమిటి మా ఇద్దరి మధ్య గొడవలు తెలిసినట్టు అలా మాట్లాడుతున్నాడు అని రిషి మనసులో అనుకుంటాడు పక్కనే ఉన్న పిఏదో తను చేయవలసిన సైన్స్ అన్ని అయిపోయినాయ అని అడుగుతాడు మొత్తం అయిపోయింది సార్ అని తను చెప్తాడు మనం మళ్ళీ కలుద్దాం అని మినిస్టర్ అంటాడు..

guppedanta-manasu Mahindra who gave a warning pointing the finger at Devaya
guppedanta-manasu Mahindra who gave a warning pointing the finger at Devaya

మహీంద్రా నువ్వు నీ జీవితాన్ని ఏమైనా చేసుకో.. రిషి జీవితాన్ని పాడు చేయకు.. రిషి వసుధర ఇద్దరు కలిసి ఉంటే అలా మాట్లాడుతున్నావు ఏంటి.. జగతి వచ్చాక నువ్వు చాలా మారిపోయావు.. ఒకప్పుడు రిషి వెన్నంటే ఉండి ప్రతి దానిని నువ్వే చూసుకునేవాడివి. కానీ ఇప్పుడు రిషి గురించి ఆలోచించడమే మానేశావు అని దేవయాని అంటుంది.. రిషి వసుధర ఇద్దరు కలిసి తిరుగుతూ ఏదైనా తప్పు జరిగితే.. ఈ ఇంటి పరువు పోవటం లేదా.. ఆ వసుధర ను ఈ ఇంటి కోడలుగా తీసుకొ రావాలి అని అనుకుంటున్నారా అని మహీంద్రా తో అంటుంది.. లేవని అసలు వాళ్ళిద్దరూ కలవటానికి మీరు ప్లాన్లు వేస్తున్నారు అని దేవయాని అనగానే అక్కయ్యా అని జగతి అంటుంది.. అసలు రిషికి వసుధార పరిచయమైదానికి కారణం నువ్వే కదా అని జగతిని అంటుంది దేవయాని..

నువ్వు ఆ వసుధారని ఈ కాలేజీకి పంపించడం రికమెండ్ చేయడం వల్లే కదా తను ఇక్కడికి వచ్చింది. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అని దేవయాని అంటుంది వదిన గారు అని మహీంద్రా అంటాడు.. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా.. మీరు ఎక్కువ చేస్తున్నారు అని దేవయాని అంటుంది.. ఈ మహా తల్లి రిషిని వదిలి వెళ్తే ప్రాణానికి ప్రాణంగా రిషిని చూసుకుంది.. నేను ఇప్పుడు రిషి ని ఎవరికి పడితే వాళ్లకు అంటగడతాను.. అంటే నేను చూస్తూ ఊరుకోను అని దేవయాని అంటుంది.. రిషి జీవితంలో ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను అని అంటుంది దేవయాని..

వదిన గారు రిషి మా కొడుకు.. ఇప్పటి వరకు మీరు మా జీవితాలను దుర్భరం చేశారు.. ఇప్పుడు రిషి జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను ఊరుకోను అని దేవయానితో మహేంద్ర అంటాడు.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. నేను మీరు చేసిన కుట్రల గురించి ఒక్కసారి అన్నయ్య రిషిలతో చెప్పానంటే మీ స్థాయి ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. వదిన గారు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని మహీంద్రా దేవయానికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు..