5G Smart Phones : అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే. ఏ రోజు ఏ బ్రాండ్ నుంచి లాంచ్ అంటే..? 

5G Smart Phones : నిన్నటితో ఫ్లిప్ కార్ట్ అలాగే అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ ముగిసాయి . ఇకపోతే అక్టోబర్ నెలలో 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏ బ్రాండ్ నుంచి ఏ 5G స్మార్ట్ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. తాజాగా గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ 7 సీరీస్ ను అక్టోబర్ లో లాంచ్ చేస్తున్నట్టు ఇదివరకే కంపెనీ స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలోని చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ కూడా ఇప్పుడు కొత్త షియోమి 12 T ఫ్లాగ్ షిప్ ఫోన్లు కూడా రాబోతున్నాయని వెల్లడించింది. ఇక వచ్చే నెలలో MOTO G72 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవడానికి సిద్ధమయ్యింది. ఇక అక్టోబర్ 2022లో మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. ఇక 5G స్మార్ట్ ఫోన్ లిఫ్ట్ ఒకసారి చూద్దాం.

These are the 5G smartphones that will be launched in October.
These are the 5G smartphones that will be launched in October.

Pixel 7- Pixel 7 Pro:
గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త 7 సీరీస్ రాబోతోంది. ఇక పిక్సెల్ 7 సీరీస్ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ కొత్త పిక్సెల్ 7 ఫోన్లు కూడా భారత మార్కెట్లోకి రానున్నాయి అని ధ్రువీకరించింది. ఇకపోతే రాబోయే పిక్సెల్ 7 సిరీస్ పాత డిజైన్ మాదిరిగానే ఉంటాయని కూడా సమాచారం అందుతుంది. ఇకపోతే ఈ సీరీస్ లో ఫీచర్ లో పెద్దగా మార్పులు ఉండవని , కాకపోతే 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి త్వరలోనే లాంఛ్ కానున్నట్లు సమాచారం.

MOTO G72:
ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ మూడో తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ డివైస్ సాధారణ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్ తో వస్తుంది. ఇక ఈ 5G స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ 128GBస్టోరేజ్ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. 120 Hz రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది.

ఇక వీటితోపాటు షియోమి 12T, షియోమి 12T ప్రో 5G స్మార్ట్ ఫోన్స్ కూడా అక్టోబర్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి.