Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. ఆగిపోనున్న ఆరో సీజన్..

Bigg Boss 6 Telugu :  ఏంటి మేం చదివింది నిజమా కాదా అనే షాక్ లో ఉన్నారా.. అవును ఇది నిజంగా బిగ్ బాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ స్ట్రీమింగ్ ఆగిపోతుంది.. ఈ వార్త తెలుసుకున్న బిగ్ బాస్ ఫాన్స్ మాత్రం కంగు తింటున్నారు. భారీ అంచనాల నడుమ తెలుగులోనే అతిపెద్ద రియాల్టీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరికొన్ని రోజుల్లో ముగియనుంది.. చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరో అవుతారు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

Bigg Boss Telugu season 6 Disney hotstar streaming stopped on few hours
Bigg Boss Telugu season 6 Disney hotstar streaming stopped on few hours

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కప్పు కొడతారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సమయంలో బిగ్ బాస్ 6 కి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిగ్ బాస్ 6 ఫినాలే ఎపిసోడ్ ఎప్పుడు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. పాత కంటెస్టెంట్లతో సరికొత్త సింగర్స్ తో మంచి మంచి డాన్స్ పర్ఫామెన్స్ లతో ఆ రోజు ఎపిసోడ్ ఎంత గా హోరెత్తిస్తారు. ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కూడా చూస్తేలాగా ఉంటుంది. ఈ ఒక్క ఎపిసోడ్ టీఆర్పి రేటింగ్ మాత్రం ఊహించని రేంజ్ లో ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. ఈసారి కూడా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఎవ్వరూ ఊహించని విధంగా సర్ప్రైజెస్ క్రియేట్ చేయాలని ఆ ఎపిసోడ్ కి మంచి టిఆర్పి రేటింగ్స్ తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుందట. ఈ నేపథ్యంలోనే డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు స్ట్రీమింగ్ అయ్యే బిగ్ బాస్ షోను మరికొన్ని గంటల్లో నిలిపివేయబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ 24 గంటలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటే లోపల గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చేసే సర్ప్రైజెస్ అన్ని రివీల్ అయిపోతాయని బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఫస్ట్ టైం ఇలా బిగ్ బాస్ స్ట్రీమింగ్ ఆపేయాలని నిర్ణయం తీసుకోవడం అందరికీ షాకింగ్ అని ఉందంటున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఏమవుతుందో..