Samantha : సమంత లాగే నేను ఆ వ్యాధితో బాధపడుతున్నానన్న రంగం బ్యూటీ.!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం తను సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యాధితో కొంతమంది హీరోయిన్లు బాధపడుతున్నట్లు తెలియజేశారు.. తాజాగా ఈ లిస్టులోకి రంగం బ్యూటీ కూడా చేరింది..

rangam-movie-heroine-piya-baj-pai-facing-samantha-myositis
rangam-movie-heroine-piya-baj-pai-facing-samantha-myositis

మయోసైటిస్ వ్యాధి గురించి కల్పిగా గణేష్, పూనమ్ కౌర్ వంటి హీరోయిన్లు తాము కూడా సమంత లాంటి వ్యాధితో బాధపడుతున్నామని తెలిపారు. అయితే తాజాగా జీవ హీరోగా నటించిన రంగం సినిమాలో నటించిన హీరోయిన్ పియ బాజ్ పైయ్ సైతం తను కూడా సమంత లాంటి వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చికిత్స లేనటువంటి ఈ వ్యాధితో బాధపడటం ఎంతో నరకంగా ఉంటుందని ఆమె తెలిపారు. సమంత ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలియగానే నాకు చాలా బాధ కలిగిందని ఆమె పడుతున్న ఇబ్బందులు నేను కూడా అర్థం చేసుకోగలనని బాజ్ పైయ్ వివరించారు.

మయోసైటిస్ వ్యాధితో నేను కూడా బాధపడుతున్నానని మా ఇంట్లో వాళ్లకు తెలిస్తే బాధపడతారని నేను ఈ విషయాన్ని వారితో చెప్పకుండా ముంబైలో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని బాజ్ పైయ్ ఈ సందర్భంగా తెలిపారు. మయోసైటిస్ వ్యాధి గురించి హీరోయిన్ పియ బాజ్ చేసినా కామెంట్స్ తింటా వైరల్ అవుతున్నాయి.