NTR : ప్రశాంత్ నీల్ ని ఆ పని చేయొద్దంటూ దండం పెడుతున్న తారక్ ఫ్యాన్స్..

NTR : ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత తారక్ తన నెక్స్ట్ సినిమా పై కాన్సన్ట్రేషన్ చేయట్లేదని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి.. విషయం ఏంటో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టట్లేదు అన్న వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయినా కానీ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమాలను మొదలు పెట్టకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..

Advertisement
Junior NTR fans requested Prasanth nel on ntr31 movie
Junior NTR fans requested Prasanth nel on ntr31 movie

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి కానీ.. ఆ తరువాత ఆ సినిమా షూటింగ్ కి వెళ్లడం కానీ నెక్స్ట్ ప్రణాళికలు కానీ ఆచరణలోకి రాలేదు. కొరటాల శివ తో దర్శకత్వంలో వచ్చే సినిమాను తారక్ అసలు పట్టించుకోవడం లేదు అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది. కొరటాల శివ కూడా ఎన్టీఆర్ చెప్పిన విధంగా స్క్రిప్ట్ లో గత ఆరు నెలలుగా మార్పులు చేస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆ సినిమాను పక్కనపెట్టి ఎన్టీఆర్ 31 సినిమాను మొదలు పెడితే బాగుంటుందని ఫాన్స్ సలహా ఇస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కొరటాల శివ లాగా నువ్వు సినిమా ల్యాక్ చేయదని.. ఈ సినిమా కంటెంట్ మంచిగా ఇస్తే సినిమా హిట్ చేసే బాధ్యత మాది అని.. దయచేసి కొరటాల శివ లాగా సినిమా అప్డేట్స్ ఇవ్వకుండా ఫాన్స్ ను ఇబ్బంది పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.. హీరోయిన్ విషయంలో కూడా కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువగా తీసుకుని త్వరగా అప్డేట్స్ ఇస్తే ఎన్టీఆర్ 31 బ్లాక్ పాస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబెడతామని హామీ ఇస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఏం చేస్తారో చూడాలి.

Advertisement