Ram Charan : మెగాస్టార్ చిరంజీవి చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.. ఈ విషయం తెలియడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. అయితే గతంలో ఉపాసన పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

పిల్లల్ని కనడం అంటే 20 ఏళ్ల ప్రాజెక్టు అని ఆమె తెలిపారు. పిల్లల్ని కనడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణిని తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత. వాళ్లు పుట్టిన తరువాత ఆ పిల్లలకి ఏమేమి ఇవ్వాలి ఏం చేయాలి అనే విషయాల గురించి ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి.
ఆ తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని ఇలాంటి విషయాల గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే పిల్లల కోసం ప్లాన్ చేయాలని ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు కావాల్సిన అవసరాలన్నిటిని ముందుగానే సమకూర్చి పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ గతంలో ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే పిల్లల్ని కనటానికి కూడా ఉపాసన ఓ బిజినెస్ మాన్ గా బిజినెస్ యాంగిల్ లోనే చెప్పారని తెలుస్తోంది. ఇలా ఉపవాసగా చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.