Big Boss 6 Telugu : ఎలిమినేట్ అయిన 12 గంటలు తిరగకుండా నాగార్జున, మాటీవి కి ఝలక్ ఇచ్చిన గీతూ రాయల్..!

Big Boss 6 Telugu :  బిగ్ బాస్ సీజన్ 6 లో నేనే తోపు కంటెస్టెంట్ అని అనుకుంటున్నా గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. గీతు బాగా ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుంది. స్ట్రాటజీలు కూడా బాగానే వాడుతుంది అనే కారణాలు తప్ప తనని ఇష్టపడేందుకు ఇంకో కారణం కూడా కనిపించదు.. గీతూ రాయల్ ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ నన్ను బయటకు పంపించవద్దు అంటూ కన్నీరు మున్నీరయింది. అంతలా బ్రతిమలాడుకున్న గీతూ ఊహించని విధంగా స్టార్ మా కు ఏదో ట్విస్ట్ ఇచ్చింది అని తెలుస్తోంది..!

bigg-boss-telugu-geethu-rayal-elimination-sensational-comments-on-nagarjuna-and-star-maa-channel
bigg-boss-telugu-geethu-rayal-elimination-sensational-comments-on-nagarjuna-and-star-maa-channel

బిగ్ బాస్ ఇంట్లో విన్నర్ నేనే అవుతాను అని కలగనే దాన్ని.. కనీసం రన్నర్ అని కూడా అనుకోలేదు. కేవలం విన్నర్ అనే ఆలోచన తోనే ఉన్నాను అని చెప్పిన గీతు ఈ ఎలిమినేషన్ ను తీసుకోలేక పోయింది. బిగ్ బాస్ ఇంటికి ఓ పర్పస్ మీద నేను వచ్చానని చెప్పింది గీతక్క. చివరికి ఆటిట్యూడ్ తో విసిగిపోయిన జనాలు తనని ఎలిమినేట్ చేశారు. గీతూ ఎలిమినేషన్ పూర్తిగా జనాభిప్రాయం మేరకే జరిగింది. అయితే తన ఎలిమినేషన్ ను తీసుకోలేకపోయిన గీతూ మాత్రం.. ఇదంతా నాగార్జున సార్, స్టార్ మా వాళ్ళు కావాలని నన్ను బయటకు పంపించేశారు అని గీతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలిసింది..

అంతేకాకుండా బిగ్ బాస్ ఇంటి గురించి కొన్ని సీక్రెట్స్ ని కూడా రివీల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన వచ్చిన తర్వాత కొన్ని విషయాలను బయటకు చెప్పకూడదు. ప్రతి ఒక్కరూ ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. పర్సనల్ గా వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ మీడియా ముఖంగా మాత్రం విషయాలు చెప్పకూడదు. అయితే తన ఎలిమినేషన్లు తట్టుకోలేకపోయినా గీతూ బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. అంతేకాకుండా స్టార్ మా వాళ్ళు కావాలని నన్ను చెడుగా చూయించారని చెప్పుకొచ్చింది. నాగార్జున సార్ కూడా నాకు హెల్ప్ చేస్తారు అని అనుకున్నాను. కానీ చివరికి నాగార్జున సార్ కూడా మోసం చేశారు అంటూ బిగ్ బాస్ గీతూ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గీతూ బయటికి వచ్చిన 12 గంటల్లోనే నాగార్జున, స్టార్ మా కి ఊహించని విధంగా ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. గీతూ లాంటి మైండ్ స్ట్రాటజీ కేవలం ఆటకు మాత్రమే పనికి వస్తుంది. కానీ విన్నర్ అవ్వడానికి పనికిరాదని ఇప్పటికైనా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు తెలుసుకుంటే మంచిది.