Samantha : సమంత వ్యాధిని సింపతితో క్యాష్ చేసుకుంటున్న ఆ ప్రొడ్యూసర్.!

Samantha : స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం యశోద.. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కింది. హరి హరీష్ లు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

Samantha illness cashing on that movie producers
Samantha illness cashing on that movie producers

ప్రస్తుతం సమంత మయూసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందరూ సమంత త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు సమంతా ఆరోగ్యం బాగో లేకపోయినా తను చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. ఇప్పటికే ఈ రెండు విషయాలతో సమంత డెడికేషన్ ఏంటో అర్థం అవుతుంది. మరోవైపు సమంత ఆరోగ్యం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయింది. ఈ పరిణామాల మధ్య యశోద చిత్రం విడుదల కానుంది. సరిగ్గా యశోద చిత్రం విడుదల కి కొన్ని రోజుల ముందే సమంత తను అనారోగ్య సమస్యతో బాధపడుతుందని చెప్పటం. అయినా కానీ ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను విడుదల చేయాలి కోవడంలో కూడా ఓ లాభం ఉంది అనేది నేటిజన్ల మాట.

సమంత ఆరోగ్యం బాగోలేదన్న సెంటిమెంట్ ను అర్థం పెట్టుకొని యశోద సినిమా హిట్ చేయాలని అనుకుంటున్నారట. సాధారణంగా యశోద చిత్రం హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని టాక్ వచ్చింది. పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. అయితే ఇప్పుడు సమంతా అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకోని ఈ సినిమా ను హిట్ కొట్టించి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారట. పైగా సమంత నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో వాళ్లు కూడా ఒకంత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా సమంతకు ఎలాంటి న్యూస్ ను అందిస్తుందో చూడాలి. మరోవైపు సమంత ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి సిద్ధమవుతుంది.