Big Boss 6 Telugu : అంచ‌నాలు త‌ప్పాయా.. గీతూ ఎలిమినేట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

Big Boss 6 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 6 రోజురోజుకి ఆస‌క్తిక‌రంగా మారుతున్న విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ అంటే ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఎవ‌రు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో, ఎవ‌రు సీక్రెట్ రూమ్‌కి వెళ‌తారో, ఎవ‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారో గెస్ చేయ‌డం క‌ష్టం. కాని ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేష‌న్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. త‌న‌కు తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రొజెక్ట్ చేసుకున్న గీతూ ఈ వారం ఎలిమినేట్ కాగా, ఆమె బిగ్ బాస్ హౌజ్ వీడుతున్న స‌మ‌యంలో క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. క‌లలు నిజం కాన‌ప్పుడు హృద‌యం క‌ల్లోల‌మై క‌న్నీళ్లుగా మార‌తాయి.. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ గీతూ అంటూ ఎపిసోడ్ చివ‌ర్లో నాగార్జున చెప్పిన ఈ వ్యాఖ్య‌లు కూడా అంద‌రిని ఆలోజింప‌జేశాయి.

these-are-the-reasons-for-geethu-elimination
these-are-the-reasons-for-geethu-elimination

Big Boss 6 Telugu : ఈ త‌ప్పులే..

గీతూ తాను ఎలిమినేట్ అయిన వేళ బిగ్ బాస్ వ‌దిలి వెళ్ల‌న‌ని వెక్కి వెక్కి ఏడ‌వ‌డం ప్రతి ఒక్క‌రిని క‌దిలించింది. ఐ లవ్ యు బిగ్ బాస్.. నేను పోను బిగ్ బాస్ అంటూ గీతూ రాయల్ బోరు బోరున ఏడ్వడం.. వేదికపైకి వెళ్లిన తరవాత కూడా నాగార్జున ఎదుటే గుక్కపెట్టి ఏడ్వడం.. నేను పోను సార్ అంటూ కన్నరు మున్నీరుగా విల‌పించ‌డం అందరు ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ లో మొన్నటివరకు టైటిల్ విన్నర్ అనే ట్యాగ్ తో కొనసాగుతూ వచ్చిన గీతూ రాయ టాప్ 5లో ఒకరిగా ఉంటారని అందరూ అనుకున్నారు. గీతూ కూడా ఆ రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది అనుకోండి.

గీతూ నార్మ‌ల్‌గా ఉన్న కూడా కొన్నాళ్ల‌పాటు ఉండేది. కాని గేమ్ లో రూల్స్ కూడా బ్రేక్ చేస్తూ సంచాలకురాలిగా ఉన్నా కూడా ఆటను కొనసాగిస్తూ, ఇతరుల ఆటలు కూడా చెడగొట్టాలని చూడ‌డంతో భారీగానే మూల్యం చెల్లించుకోవ‌ల‌సి వ‌చ్చింది. . తొలి రోజు నుంచే గీతూ ఇతర కంటెస్టెంట్స్ తో చాలా హార్ష్ గా ఉండడం మొదలు పెట్టింది. మొద‌ట్లో కాస్త ఎంట‌ర్‌టైన్ చేసిన రాను రాను గీతూ బిహేవియర్ పట్ల నెగిటివిటి పెరిగిపోయింది. ఏ ఆటలో అయినా నిబంధనలు కాకుండా క్రీడా స్ఫూర్తి అనేది కూడా ఒకటి ఉంటుంది. దానిని బ్రేక్ చేయ‌కూడ‌దు. ఇతరుల ఎమోషన్స్ ని దెబ్బతీసి పైచేయి సాధించాలని గీతూ ఎంత‌గానో భావించింది. ఇది ఆమెకి మొదటి మైనస్ గా మారిందనే చెప్పాలి. గత రెండు వారాల్లో గీతూ… ఆదిరెడ్డి, బాలాదిత్యతో ప్రవర్తించిన తీరు కూడా ఆమెకు పెద్ద‌ మైనస్ గా మారింది. గీతూ మాత్రం మైండ్ గేమ్ మాయలో పడి తన ప్రవర్తన మార్చుకోక‌పోవడంతో ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు.