Home Positive Energy : సంతోషాన్ని,సంపదను తీసుకు వచ్చే పాజిటివ్ ఎనర్జీ కావలి అంటే ఇంట్లో ఇలా చేసి చూడండి !!

Home Positive Energy : ఇల్లు పాజిటివిటీ ని కలిగి ఉంటే.. ఆ ఇంట్లో సంతోషం తో పాటు సిరి సంపదల కు ఎలాంటి లోటు ఉండదు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఆ పాజిటివిటీని పెంచుకోవడం కోసం కొన్ని మార్పులుచేసుకుంటే సరిపోతుంది. అలాంటి కొన్ని మార్పులగురించి తెలుసుకుందాం.

Do this at home if you want positive energy that brings happiness and wealth
Do this at home if you want positive energy that brings happiness and wealth

గణపతి ప్రతిమ

ఇంటి గుమ్మంలో కి రావడం తో నే ఎదురుగా వినాయకుడు కనిపిస్తూ ఉండేలా పెట్టుకోవడం వలన ఆ ఇంట శుభం కలుగుతుంది.కాబట్టి తప్పని సరిగా గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుని.. ఇంట్లోకి సంతోషాన్ని,శుభాన్ని తీసుకురండి.

తులసి మొక్క..

ఇంట్లో తులసి మొక్క పెంచుకోవడం చాలా అవసరం కాబట్టి, ఆవరణలో తులసి మొక్క ఉండేలా చేస్తే ఆ ఇంట్లో పోసిటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇంట్లో పోసిటివ్ శక్తి పెంచుకోవడానికి వాస్తు తెలిపినదాని ప్రకారం తులసి మొక్కను పెంచండి.

క్యాక్టస్ మొక్కలు..

క్యాక్టస్ మొక్కలు ఇంట్లోపెంచడం వలన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగి వారి మధ్య సంబంధాలు చెడిపోవడం లాంటివిజరుగుతుంటాయి. కాబట్టి క్యాక్టస్ మొక్కలకు దూరంగా ఉండటం చాలా మంచిది.

ఎక్వేరియం

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎక్వేరియం ఉంటే పోసిటివ్ శక్తి ఉంటుందట. కాబట్టి ఇంట్లో తూర్పు లేదా దక్షిణ దిశలో ఎక్వేరియంను పెట్టుకోవడం మంచిది. ఎక్వేరియం అంటే పెద్ద గాజు తొట్టే పెట్టుకోవాల్సిన పని ఏమి లేదు. చిన్న గాజు కుండీ పెట్టుకుని..దానిలో రెండు చిన్న చేపలు వేసి పెంచుతూ సమయానికి వాటికి ఆహారం అందేలా చేస్తే చాలు.

బెడ్రూమ్ లో అద్దాలు..

వాస్తు లో తెలిపినదాని ప్రకారం..పడక గదిలో ఎలాంటి అద్దాలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వలన అవి నెగిటివ్ ఎనర్జీని ప్రసరింప చేసి ఇంట్లో గొడవలు, వాదనల కు కారణం గా నిలుస్తాయి. పడకగది లో అద్దాలు ఉండటం వల్ల కూడా నిద్రలేమి సమస్యలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందట. మరీ ముఖ్యంగా మంచం మీద పడుకుంటే,మనకు మనం అద్దంలో అస్సలు కనపడకూడదట. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

విరిగిపోయిన వస్తువులు..
చాలా మంది ఇంట్లో పనికిరాని వస్తువులను పడేయకుండా దాచి పెడుతుంటారు. ఇంట్లో అలాంటి వస్తువులు ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. విరిగిపోయిన వస్తువు కుర్చీ ,డెకరేటివ్ వస్తువు అది ఏదైనా కూడా.. విరిగిపోతే మాత్రం దాన్ని ఇంట్లో నుండి తీసేయాలట.