Smart TV Offers : రూ. 20 వేలకే భారీ డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీలు.. అదిరిపోయే ఫీచర్స్ తో..!

Smart TV Offers : అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు కావాలని ఆలోచించే వారికి ప్రముఖ టీవీ కంపెనీలు భారీ డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం టిసిఎల్, కొడక్ మరియు మరికొన్ని కంపెనీలు తమ స్మార్ట్ టీవీ లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లు ప్రకటించడం గమనార్హం. మరి ఆ స్మార్ట్ టీవీల విషయాలను ఇప్పుడు చూద్దాం.

get-big-display-smart-tvs-at-rs-20000-with-best-features
get-big-display-smart-tvs-at-rs-20000-with-best-features

టి సి ఎల్ ఆండ్రాయిడ్ R స్మార్ట్ 40 ఇంచ్ టీవీ:

ఈ టీవీ మార్కెట్లో లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.40,990.. అయితే ఇప్పుడు అమెజాన్ లో 54% తగ్గింపుతో కేవలం రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ టీవీ డిస్ప్లే విషయానికి వస్తే.. 1920 x 1080 పిక్సెల్ రెజల్యూషన్ తో 60 Hz రిఫ్రెష్ రేటుతో లభిస్తుంది. ఇందులో 1GB ర్యామ్, 8 GB స్టోరేజ్, వైఫై, హెచ్డిఎంఐ, 20W స్పీకర్లు అన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి.

ఐ ఫాల్కన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ 43 ఇంచ్ టీవీ:

ప్రస్తుతం అమెజాన్లో 54 శాతం డిస్కౌంట్తో ఈటీవీ ని రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా హెచ్డి సపోర్ట్, 24 W స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వంటి అనేక ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తుంది. ఇందులో హాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్, T-cast, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ,నెట్ ఫ్లిక్స్, జీ ఫైవ్ , సోనీ లైవ్ తో పాటు మరికొన్ని ఓటిటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.

కొడక్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి 32 ఇంచ్ టీవీ:

32 అంగుళాలు కలిగిన ఈటీవీ మోడల్ ప్రస్తుతం అమెజాన్ లో రూ.10,499 కే అందుబాటులో ఉంది. ఇందులో 1GB ర్యామ్, 8 GB స్టోరేజ్, హెచ్డిఎంఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్, ఆండ్రాయిడ్ టీవీ 9 ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈటీవీ వస్తుంది.