Hansika : హన్సిక జీవితం కూడా శ్రీదేవి లాగే మారనుందా.. ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా అవుననాల్సిందే..!

Hansika : హన్సిక మోత్వాని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి దేశముదురు సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విశేషమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో హన్సిక కూడా ఒకరు. టాలీవుడ్ లోని కొంతమంది యంగ్ హీరోల సరసన నటించి మెప్పించిన హన్సిక తమిళ్లో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హన్సికకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా హన్సిక ఆధ్వర్యంలోనే ముంబైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకోబోతోందట. అయితే ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. హన్సిక చేసుకోబోయేది ఎవరినో కాదు ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ సోహెల్ కతురియా..

Will Hansika life also become sreedevi life..?
Will Hansika life also become sreedevi life..?

సోహెల్ హన్సిక ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి. సోహెల్ కూడా చూడడానికి హీరోలాగా ఉండడంతో నెటిజన్లు.. అతడు గురించి తెలుసుకోవడానికి గూగుల్ సర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం బయటపడింది. 2016లో రింకీ అనే అమ్మాయితో వివాహం జరిగిందట. రింకీ కూడా హన్సికకు బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం. అయితే వారి రిలేషన్ లో గొడవలు రావడంతో సోహెల్ రింకీ కి విడాకులు ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత హన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న హన్సిక పై అభిమానులు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానీ శ్రీదేవి చేసిన తప్పే నువ్వు చేస్తున్నావా? అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.. గతంలో శ్రీదేవి కూడా వివాహం జరిగి , పిల్లలు ఉన్న బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హన్సికపై ఆమె అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక హన్సిక, సోహెల్ పెళ్లికి కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. కానీ కొన్ని అనుకోని కారణాలు వల్ల క్యాన్సిల్ అయిందని సమాచారం. మరి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా వీరి పెళ్లి జరుగుతుందో లేదో చూడాలి. ఇదే గనుక జరిగితే హన్సిక జీవితం కూడా శ్రీదేవి లాగే మారాల్సిందే.ఇది వున్న నెటిజన్స్ కూడా ఖచ్చితంగా అవుననే అంటున్నారు.