Rice Recipe : నైట్ అన్నం మిగిలిపోయింది అని బాధ పడే లేడిస్ కోసం.. ఇలా చేయండి టిఫిన్ కి బెస్ట్ ఐడియా!

Rice Recipe :లంచ్ బాక్సులకి లేదా మన ఇంటికి ఎవరైనా సడన్ గా వచ్చినా వాళ్లకి త్వరగా ఏమి చేసి పెట్టాలని మహిళలు ఆలోచిస్తుంటారు. అయితే త్వరగా అయిపోయే ది బెస్ట్ రెసిపీ కోసం మహిళలలు చూస్తున్నారా? అయితే పల్లీలు రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా చాలా సింపుల్గా, త్వరగా రెడీ అయ్యే రైస్ రెసిపీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ పల్లీల రైస్ రెసిపీ చేయడం చాలా సులువు. స్కూలు పిల్లల లంచ్ బాక్సుల కోసం, ఆఫీస్ కు వెళ్ళే వాళ్ల కోసం లేదా నైట్ అన్నం మిగిలిపోయినా ఇది చేయడం చాలా సులువు త్వరగా అవుతుంది. అంతేకాక చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీల రైస్ తినడానికి చట్నీ కూడా అవసరం ఉండదు.

make-this-is-the-best-idea-for-tiffin
make-this-is-the-best-idea-for-tiffin

మా ఇంట్లో నైట్ అన్నం మిగిలిపోయినట్లయితే దానిని వేస్ట్ చేయకుండా తెలంగాణ కారం అన్నం లేదా పల్లీల రైస్ ఎక్కువగా చేస్తూ ఉంటాం.

* అన్నీ పప్పులను ఒక్కొక్కటిగా నెన్ముదిగా స్టవ్ ని స్లో ఫేమ్ లో పెట్టి వేయించుకుంటే, పప్పులు లోపలి దాకా వేగి మంచి రుచిగా. ఉంటాయి.

* తాలింపు గింజలను, పప్పులను ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుంటే వాటిని
తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది.

* అయితే అన్నంలో పచ్చి కొబ్బరినీ వేస్తే ఎండా కాలంలో అయితే అన్నం పాడవడానికి అవకాశం ఉంది. అలా అని పచ్చి కొబ్బరిని వేయకపోతే అంత రుచి రాదు, అందుకని తాళింపులో పచ్చి కొబ్బరిని వేసి బాగా వేయించండి. ఇలా చేయడం వల్ల అన్నం. చెడిపోయే అవకాశం ఉండదు.

కావాల్సిన పదార్థాలు

* వేరుశనగపప్పు 1/4 cup

* నువ్వులు 1/4 *ఎండు మిర్చి – 4

* పచ్చి కొబ్బరి 1/4 కప్పు
* ఉడికించిన అన్నం ఒక కప్పు
*ఉప్పు – తగినంత
*నూనె 1/4 కప్పు
*ఆవాలు 1/2 స్పూను
* మినపప్పు 1 టేబుల్ స్పూను

* సెనగపప్సు 1 టేబుల్ స్పూను

*కరివేపాకు 2 రెబ్బలు

1. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో వేరుశనగ పప్పుని వేసి స్టవ్ ని స్లో ఫేమ్ లో పెట్టి

3 నుంచి 4 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి.

2. దీని తరువాత ఎండు మిర్చిని, పచ్చి కొబ్బరిని, నువ్వులను వేసుకుంటూ మంచి సువాసన వచ్చేవరకు బాగా వేయించుకోండి.

3. ఈ పప్పులను చల్లార్చుకుని మిక్సిలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు మరొక పాన్ పెట్టి దానిలో నూనె ను వేసి నూనె వేడెక్కిన తరువాత తాళింపు గింజలను వేసి, అన్నం, ఉప్పు, కచ్చా పచ్చాగా చేసిన వేరుశనగ పప్పు పొడిని వేసి బాగా కలిపిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యండి.
5. ఇలా చేసిన తరువాత దానిని కాస్త చల్లారనిచ్చాక

బాక్స్ లో పెట్టుకోండి. చూడడానికి

చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాని చాలా
రుచిగా ఉంటుంది. ఈ పల్లీల రైస్.