BigBoss 6 Telugu : ఆ మూడు తప్పుల వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చాడు.. చలాకీ చంటి చేసిన అతి చెత్త పని..!

BigBoss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు ఉంటాడు అనుకున్న చలాకి చంటి 5 వారాల తర్వాత అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. అభిమానులకు ఈయన ఎలిమినేషన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే జబర్దస్త్ లో అంత పాపులర్ కమెడియన్ కేవలం 5 వారాలు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉండడం.. ఏ మాత్రం ప్రభావం చూపించకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడం ఓ రకంగా షాకింగ్. నాగార్జున కూడా చలాకి చంటి ఎలిమినేషన్ పై ఇలాగే స్పందించాడు. ఈయన ఏం తప్పులు చేశాడు.. ఎందుకు ఇంత త్వరగా ఎలిమినేట్ అయ్యాడు అంటే దానికి ప్రత్యేకంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

BigBoss 6 Telugu : చలాకి చంటి చేసిన తప్పులేంటి..?

బిగ్ బాస్ 6 సీజన్ మొదలైన రోజు నుంచి అతడి ఎలిమినేట్ అయ్యే రోజు వరకు చలాకి చంటి ఎక్కడ పెద్దగా గేమ్ ఆడినట్టు కనిపించలేదు. అందరితో కలిసి ముచ్చట్లు పెట్టడం తప్ప ఈయన పెద్దగా చేసింది ఏమీ లేదు. ఇంట్లో టాస్కులు వచ్చినప్పుడు కూడా కామ్ గా పక్కకు వెళ్లి కూర్చోవడం.. లేదంటే అనవసరపు సోది పెట్టడం తప్ప.. గేమ్ మీద ఫోకస్ చేసిన రోజు ఒకటి కూడా లేదు. ఈయన ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం. అదే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ గేమ్ చాలా సీరియస్ గా తీసుకుంటే చలాకి చంటి మాత్రం చాలా కామెడీగా తీసుకున్నాడు. ఏదో 4 జోకులు వేసి ఇంట్లో నవ్విస్తే చాలు ప్రేక్షకులు ఓటు వేస్తారు అనే భ్రమల్లో ఉన్నాడు. తనకు బయట చాలా క్రేజ్ ఉంది కాబట్టి ఎలాగోలా బయటపడిపోతా.. సేఫ్ అయిపోతాను అనే నమ్మకం అతడిలో ఎక్కువగా కనిపించింది. ఆయ‌న చేసిన త‌ప్పుల‌ని గ‌మ‌నిస్తే..1) నాగార్జున ప్రతి వారం చలాకీ చంటిని గేమ్ ఆడాలి అంటూ హెచ్చరిస్తూనే ఉన్నాడు.

chanti-clears-about-the-elimination
chanti-clears-about-the-elimination

దాన్ని సీరియస్ గా తీసుకోలేదు.. దాని ప్రభావం ఎప్పుడు కనిపించింది. చంటి ఎలిమినేట్ అవ్వడానికి రెండో కారణం 2) గీతూతో గొడవ పడడం.. రెండు వారం నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా నాలుగో వారం గీతు, చంటి మధ్య పెద్ద స్థాయిలో యుద్ధం జరిగింది. ఈ గొడవలో తప్పు గీతు చేసింది అని నాగార్జున స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా ఆ తర్వాత రోజు ఎపిసోడ్లో తప్పు నేనే చేశాను అని చలాకీ చంటి ఒప్పుకోవడం.. ఐదవ వరం తనను తను సొంతంగా నామినేట్ చేసుకోవడంతో అతడి ఆట పూర్తిగా డీలా పడిపోయింది. 3) ఐదు వారాలు ఆటను మిమ్మల్ని మీరు ఎలా రేటింగ్ వేసుకుంటారు.. హిట్ ఫ్లాప్ లో మీ ఆట గురించి చెప్పుకోండి అని నాగార్జున అడిగితే.. చలాకి చంటి తన్నుతాను ఒక ప్లాప్ అంటూ ముద్ర వేసుకున్నాడు. తన మీద తనకే నమ్మకం లేని ఒక కంటెస్టెంట్ గా ప్రేక్షకులు మాత్రం ఎందుకు ఎంకరేజ్ చేస్తారు.. చలాకీ చంటి ఎలిమినేట్ కావడానికి ఇది కూడా ఒక ప్రధానమైన రీజన్. ఈ మూడు ప్రధానమైన కారణాల వల్లే ఈరోజు చలాకి చంటి హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు.