Health : ఈ పువ్వు తెలుసా మీకు.. దీని వలన ఎన్ని ప్రయోజనాలో !

Health :  తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగలలో బతుకమ్మ ఒకటి. ప్రపంచవ్యస్తంగా పూలను పూజించేది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. బతుకమ్మ పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పూలు. ఆ పూలలో తంగేడు పువ్వు ఒకటి. సాధారణంగా తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మను పేర్చరు. బతుకమ్మను పేర్చడానికి తంగేడు పువ్వుకు ప్రథమ స్థానం. ఉంటుంది. కానీ ఈ తంగేడు ఆకు, పువ్వులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. అయితే ఈ తంగేడు ఆకు, పువ్వులతో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వస్తాయి.

ఈ పువ్వు యాంటీఆక్సిడెంట్ల యొక్క సహజ వనరు. ఈ పూల సారంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు, టర్పైనాయిడ్లు, కార్డియాక్ గ్లైకోసైడ్లు స్టెరాయిడ్లు ఉంటాయి. ఈ పూలలో ఉండే సారం వలన మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చును. ఈ తంగేడు పూల సారం సపోనిన్లు కలిగి ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగ పడుతుంది.

Do you know how many benefits this flower has?
Do you know how many benefits this flower has?

మహిళల్లో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారించే గుణాలు ఈ పువ్వులు కలిగి ఉంటాయి. ఇది అంటు వ్యాధులను నయం చేస్తుంది. ఇది శరీరం నుండి హానికారమైన విషాన్ని పోగొడుతుంది. మలబద్దకాన్ని నివారించడంలో ఈ తంగేడు పువ్వు మందుగా పనిచేస్తుంది. తంగేడు పువ్వు టీ ను తాగడం వల్ల మలబద్ధకంతో బాధపడేవారు ప్రయోజనం పొందవచ్చు. మహిళలకు రుతుచక్రం క్రమరహితంగా అనుభవించే వారికి ఈ తంగేడు పువ్వు టీ బాగా పనిచేస్తుంది. ఈ తంగేడు పువ్వు మనలో ఉండే అదనపు కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాక ఆరోగ్యకరమైన శరీర ఆకృతి రావడానికి ఈ పువ్వు బాగా పని చేస్తుంది. ఇంకా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పువ్వు చర్మ సమస్యల చికిత్సలో సహాయపడుతుంది. ఈ పువ్వును ఫేస్ ఫ్యాక్ లాగా ఉపయోగించవచ్చు.ఇది నల్లటి మచ్చలను నివారించడమే కాక చర్మ ఛాయను కూడా మెరుగు పరుస్తుంది.

అయితే ఈ పువ్వులను టీగా తీసుకోవడం. ఉత్తమమైనది. ఇది నిర్జలీకరణాన్ని కూడా నివారింపచేస్తుంది. ఈ టీను ఎలా తయారుచేసుకోవాలంటే — ఎండిన తంగేడు పువ్వులను తీసుకోవాలి. నల్లని మిరియాల పొడిని తీసుకొని, ఈ పౌడర్ని పాలల్లో మరిగించి తాగాలి. మీరు దీనిని సూప్ త్రాగాలనుకుంటే మాత్రం తాజాగా ఉండే తంగేడు పూలను శుభ్రంగా కడిగి, అన్ని పదార్థాలను బ్లెండర్ లో వేసి 1 ఒక కప్పు నీటితో మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇంకా మిగిలిన నీటిని వేడి చేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి. దీని నెమ్మదిగా 3 కప్పుల సూప్ అయ్యే వరకు మరిగించండి. మిరియాలు,ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇక మీ సూప్ తయారైనట్టే.