Amazon Jobs: అమెజాన్ జాబ్స్.. ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు.. జీతం 30 వేలు.. ల్యాప్ టాప్ ఫ్రీగా ఇస్తారు..

Amazon Jobs: అమెజాన్ నుండి కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంట్లో నుంచి ఈ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తుంది అమెజాన్ సంస్థ.. ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు.. ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. స్త్రీ, పురుషులు ఇద్దరూ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..
ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపీ తెలంగాణ వాళ్ళిద్దరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అమెజాన్ వెబ్ సైట్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. వర్క్ చేయడానికి ల్యాప్ టాప్ కూడా ఉచితంగా ఇస్తారు. నాలుగు నెలల ట్రైనింగ్ కూడా ఇస్తారు.
మీరు అప్లై చేసిన ఒక్క వారంలోనే ఉద్యోగం వస్తుంది. రాతపూర్వక, మౌఖిక ఇంగ్లీష్, హిందీ భాషలలో వ్యాపార ప్రావీణ్యం ఉంటే చాలు. 2018, 2019, 2020,2021,2022 సంవత్సరంలో ఇంటర్ డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆ తర్వాత బెంగళూరులో జాబ్ ఉంటుంది. పోస్టులను అనుసరించి అభ్యర్థి జాబ్ లో చేరగానే 30 నుండి 50 వేల వరకు నెల జీతం తీసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రుసుము చెల్లించినవసరం లేదు.