Anasuya: అనసూయ పరిచయం అక్కర్లేని పేరు.. అందం, అభినయం తోనే కాకుండా మాటలతో కూడా ఆకట్టుకునే అద్భుతమైన నైపుణ్యం ఆమె సొంతం.. యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. ఇంతకీ అనసూయ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా.!?
అనసూయ స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి. పక్కా తెలంగాణ అమ్మాయి. తండ్రి సుదర్శనరావు ఓ వ్యాపారవేత్త.. ఆయన తల్లి పేరు అనసూయ ను తన కూతురికి పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడు మిలటరీ డిస్ప్లే మెయింటైన్ చేసేవారు.. అనసూయని కూడా ఆర్మీలోకి పంపాలని అనుకున్నారట సుదర్శనరావు. కానీ అనసూయ మాత్రం బద్రుకా కాలేజ్ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకుంది. ఆ తరువాత ఐడిబిఐ బ్యాంక్ లో పనిచేసింది. అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించాక ఆ తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. ఆ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నప్పుడే సాక్షి టీవీలో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి వెంటనే అప్లై చేసిందట.. అయినా మనకెందుకు వస్తుందిలే అనుకున్న సమయంలో ఆశ్చర్యకరంగా అనసూయ ఎంపికైంది.
సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. కానీ ఆ జాబ్ నచ్చగా కొన్నారు ఇంటికే పరిమితమైంది. సినిమాలపై ఉన్న ఆసక్తితో బాగా వంటి కొన్ని చిత్రాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైంది. మొదట్లో అనుకున్న మేరకు సక్సెస్ సాధించకపోవడంతో కొన్నాళ్లు సినిమా ప్రయత్నాలు పక్కనపెట్టి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మాటీవీలోని భలే ఛాన్స్ ప్రోగ్రాం తో యాంకర్ గారి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షో తో బుల్లితెరకు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లలో నటించింది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు అనసూయకు మంచి గుర్తింపు తెచ్చాయి. అందుకే అనసూయ తనకి ఎంత బిజీ ఉన్నా కూడా టెలివిజన్ రంగాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోనని చెప్పింది.
అనసూయ ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడింది. ఎన్ సీ సీ క్యాంపులో సుశాంక్ భరద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. కానీ వెంటనే ఓకే చెప్పకుండా ఓ సంవత్సరం తర్వాత మళ్లీ ఎన్సిసి క్యాంపులో భరద్వాజ్ స్నేహం కాస్త ప్రేమగా మారింద. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో 2010 లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అనసూయ దంపతులకు ఇద్దరు పిల్లలు. సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు.