Allu Arjun : స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌.. ఇంత స్కెచ్ ఉందా.. అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌..

Allu Arjun :Allu Arjun: టాలీవుడ్ లో వడ నిర్మాత అల్లు అరవింద్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు.. ఆయన కొడుకు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు తెరపై స్టార్ హీరోగా ఉన్నారు. వందల కోట్లతో సినిమాలు తీసే అరవింద్ తన కొడుకుకి నచ్చిన తెలంగాణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అల్లు అరవింద్ ఆస్తులతో పోలిస్తే ఆయనతో వియ్యం అందుకున్న వ్యక్తి సాధారణ మనిషే అని చెప్పొచ్చు..

Allu aravind master plan on allu Arjun sneha Reddy marriage 
Allu aravind master plan on allu Arjun sneha Reddy marriage

అల్లు అర్జున్ కి పిల్లనిచ్చిన మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈయనకు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. టిఆర్ఎస్ రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి పేరుంది. కేసీఆర్, కేటీఆర్ లకు సన్నిహితులు. ఆ చోరావతోనే అల్లు అరవింద్ అల్లు అర్జున్ లకు ప్రభుత్వ పరంగా ఏ అవసరం వచ్చినా మామ చంద్రశేఖర్ రెడ్డి ముందుండి తీరుస్తారట. అందుకనే ఈ విధంగా రాజకీయపరమైన సంబంధాన్ని అల్లు అరవింద్ తన కొడుకుకి ఈ వివాహం చేశారని టాక్.

 

అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ల కు అనుమతులతో సహా వివిధ ఈవెంట్స్ కు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పిస్తారు. అంతేకాకుండా అల్లు అర్జున్ తన మామయ్య ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో కూడా బన్నీ పాల్గొన్నారు. మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది..

 

విద్యా ప్రమాణాలు పెంచుతూ పేదలకు ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు మంచి విలువైన విద్యా సేవలకు గాను ఈ అవార్డు దక్కింది. తన మామకు అవార్డుకడంతో అల్లు అర్జున్ తో పాటు ఆయన కూతురు స్నేహారెడ్డి కూడా సంతోషంగా ఉన్నారు. పలువురు టిఆర్ఎస్ నేతలు కూడా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

ఇలా రాజకీయంగా సినిమాలపరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతూ అల్లు అర్జున్ మామ దూసుకుపోతున్నారు. రాజకీయ నాయకులతో సినిమా వాళ్లకు అవసరం ఎప్పుడూ ఉంటుంది. అందుకే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చిన అల్లు అర్జున్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అల్లు అరవింద్ ఇలా రాజకీయ నాయకుల సంబంధాన్ని ఫిక్స్ చేశారని అంతా అనుకుంటున్నారు. అల్లు అరవింద్ దూర దృష్టికి హాట్సాఫ్ చెప్పాల్సిందే.