True Love : మనం ప్రేమించే వాళ్ళ కంటే కూడా.. మనల్ని ప్రేమించే వారితో ఉంటే మన జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది.. సాధారణంగా అబ్బాయిలు వారి మనసులో ఉన్న ప్రేమను తన ప్రేయసి ముందు వ్యక్తపరచరు. కానీ వాళ్ళు చేసే కొన్ని పనుల ద్వారా వారి మనసులో తమ ప్రియురాలిపై ప్రేమ ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలే నిదర్శనం. అబ్బాయి ఇలా కనుక చేస్తే ఆ అబ్బాయిని అస్సలు వదులుకోకండి అమ్మాయిలు.. ఇంతకీ ఆ పనులు ఏంటో చూద్దాం..
మిమ్మల్ని ప్రేమించే అబ్బాయిలు వారికి పర్సనల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ దగ్గరకు రాగానే వాళ్ల కష్టాలను మర్చిపోయి.. మీతో నవ్వుతూ ఉంటారు. ఒకవేళ మీతో చిన్న చిన్న గొడవలు పడినా కూడా వారు దూరమవ్వరు. ఆ గొడవలు తర్వాత ఆ ప్రేమను మరింత బలంగా ఉండేలా చూసుకుంటారు. ఇక వారి జీవితంలో ఏ విషయానికి సంబంధించిన పని చేస్తున్నా కూడా కచ్చితంగా మీ అభిప్రాయం తీసుకుంటారు. సమయం దొరికినప్పుడల్లా మీతో గడపాలని ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. మీరు సీరియల్స్ చూసే అమ్మాయిలు అయితే మీ లవర్ కూడా సీరియల్ చూడటానికి ఇష్టపడతారు. వారితో పాటు మీరు బయటకు ఎక్కడికి వచ్చినా కూడా మిమ్మల్ని చాలా సెక్యూర్ గా చూసుకుంటారు. ఇంటికి వెళ్లిందాకా జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు.
మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు మీపై ఎక్కువగా కేర్ చూపిస్తారు. మీ ప్రేమికుడు మీకోసం సానిటరీ ప్యాడ్స్ కొని ఇచ్చారంటే అతనికి మీరంటే చాలా పిచ్చి ప్రేమ అని అర్థం. అబ్బాయిలకి సానిటరీ పాడ్స్ కొనడం లాంటివి ఇష్టం ఉండవు. ఇది కొంటున్న సమయంలో అతని ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ల పరువు పోతుందని చాలామంది అబ్బాయిలు భావిస్తారు. కానీ మీ కోసం సానిటరీ ఫ్యాడ్స్ తీసుకువచ్చి ఇచ్చారంటే వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఏ అబ్బాయి అయితే మీతో మెలుగుతాడో అతడు కచ్చితంగా మీపై 100కు 100శాతం ప్రేమ చూపుతారని అర్థం..