Business Idea : ఈ చిన్న చిన్న వ్యాపారాలతో మంచి లాభాలు రావడమే కాదు… కేంద్రం స్కీం కింద డబ్బు కూడా సహాయం చేస్తారు!!

Business Idea :  ఏదైనా బిజినెస్ పెట్టాలని ఆలోచించేవారికి ఈ చిన్న చిన్న వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తాయి. అంతేకాదు ఈ వ్యాపారాలు మొదలు పెట్టడానికి మీకు కేంద్ర ప్రభుత్వం కూడా ముద్ర లోన్ స్కీం కింద సహాయం కూడా చేస్తుంది. మరి వీటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి ముద్ర యోజన, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫండ్, జెడ్ సర్టిఫికెట్ స్కీం కింద ఎంఎస్ఎమ్ఈలకు లోన్ అసిస్టెంట్, టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం లోన్ లింక్డ్ క్యాపిటల్ గ్రాంట్ వంటి కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ పథకాల కింద చిన్న వ్యాపారాలను ప్రారంభించే వారు సులువుగా లోన్లు పొందవచ్చు.

These small business with get good profit..and also government will help you..!
These small business with get good profit..and also government will help you..!

ఫర్నిచర్ వ్యాపారం:

మీరు చిన్నపాటి ఫర్నిచర్ షాప్ నడపాలన్నా కూడా కనీసం రూ.1.8 లక్షల పెట్టుబడి అవుతుంది. దీనిని ముద్రా స్కీం కింద బ్యాంకు నుంచి లోన్ కూడా పొందవచ్చు. ప్రారంభించే ముందు లోన్ అప్లై చేసుకుని వ్యాపారం మొదలుపెట్టి.. ఆ తర్వాత మంచి ఆదాయం పొందవచ్చు.

టిఫిన్ సెంటర్:

దేశంలోని పట్టణాలు, సబర్బన్ ప్రాంతాలలో వీటికి బాగా డిమాండ్ ఉంది. దీనికోసం లక్షలో పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న షాపు ఓపెన్ చేయడం లేదా ముందుగా ఇంటి దగ్గర కూడా మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత పెద్ద షాప్ పెట్టుకోవచ్చు.

బేకరీ బిజినెస్:

చాలామంది రోజురోజుకు బేకరీ ఉత్పత్తులు తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోని 4 లక్షల రూపాయల వ్యయంతో బేకరీ ప్రారంభించవచ్చు. అయితే దీనికి కొన్ని యంత్రాలు, కొంతమంది మనుషులు అవసరం అవుతారు. అలాగే యువత ఫాస్ట్ ఫుడ్ , జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాపారం మీకు మంచి లాభదాయకమైనది. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ముద్ర లోన్ కింద లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. పైగా ప్రభుత్వ సహాయం కూడా ఉంటుంది.