Hair Tips : జుట్టు ఊడకుండా జాగ్రత్త పడటం కోసం ఎలాంటి షాంపూ ని ఎంచుకోవాలి.??

Hair Tips :  ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం, ఊడిపోవడం, చుండ్రు తదితర హెయిర్ ప్రాబ్లమ్స్.. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ముఖ్యంగా ఎంచుకునే షాంపూ పై శ్రద్ధ వహించాలి. ఎటువంటి షాంపూలు ఏ హెయిర్ టైప్ వాళ్ళు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-choose-right-shampoo-for-your-hair-type
how-to-choose-right-shampoo-for-your-hair-type

ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్లు షాంపూని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వీళ్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎలాంటి షాంపూ ని ఎంచుకోవాలంటే పీహెచ్ లెవెల్స్ సరైన మోతాదులో ఉన్న షాంపూ ని చూస్ చేసుకోవాలి. లేదంటే జుట్టు రఫ్ గా అయిపోయాయి అవకాశాలు ఉన్నాయి.

నార్మల్ హెయిర్ ఉన్నవారు ట్రీట్రీ ఆయిల్ మెడికేటెడ్ షాంపూలను ఎంచుకోవాలి. ఇవి జుట్టు రాలకుండా సహాయపడతాయి.
డ్రై హెయిర్ ఉన్నవారు క్రీమ్ బేస్డ్ షాంపులను ఎంచుకోవాలి. ఏ షాంపు ని ఎంచుకున్న కూడా అందులో సోయా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆయిల్ బేస్డ్ షాంపూలను ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.
కర్లీ హెయిర్ ఉన్నవారు కెరోటిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే షాంపులను ఎంపిక చేసుకోవాలి.
షార్ట్ హెయిర్ ఉన్నవారు జోజోబా ఆయిల్ కలిగిన షాంపూలను ఎంచుకోవాలి. ఇది షార్ట్ హెయిర్ కి మంచి పోషణను అందించి జుట్టు రాలకుండా చేస్తుంది.

మీది ఏ హెయిర్ టైప్ అయినా కూడా ఎగ్ ప్రోటీన్, సోయా మిల్క్, గ్లిజరిన్, షి బటర్ వంటి న్యూట్రీషియస్ ప్రొడక్ట్స్ కలిగి ఉన్న ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీ హెయిర్ టైప్స్ తో సంబంధం లేకుండా ఈ పదార్థాలు అన్నీ కూడా స్కాల్ఫ్ కు పోషణను అందించి జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.