JIo Offers : జియో కస్టమర్లకు శుభవార్త.. రూ.119 లోపే రోజుకు 1.5 జిబి డేటా..!

JIo Offers : జియో ఎప్పటికప్పుడు తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది . ముఖ్యంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే ఈ ప్లాన్లు మరింత చౌక ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. జియో తమ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే విధంగా ఒక ప్లాన్ జాబితాను విడుదల చేసింది . అందులో మీరు జియో వినియోగదారు అయితే అలాగే తక్కువ ధరలో ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడొక అద్భుతమైన రీఛార్జి ప్లాన్ మీకోసం తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.119 మాత్రమే..

Good news for jio customers.. get daily 1.5 GB data at only rs.119.
Good news for jio customers.. get daily 1.5 GB data at only rs.119.

భారతి ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా యొక్క ప్లాన్లకు పోటీ ఇవ్వడానికి రిలయన్స్ జియో ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో అందిస్తున్న ఈ ప్లాన్ ద్వారా మీరు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లతో పాటు జియో యాప్ లఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. మరి రూ.119 ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అలాగే వినియోగదారులు ప్రతిరోజు 1.5జిబి డేటా చొప్పున ఎంజాయ్ చేయవచ్చు. మొత్తం 14 రోజులకు గాను 21 జిబి డేటా లభిస్తుంది. డైలీ డేటా ముగిసిన తర్వాత వినియోగదారులు 64 కేబిపిఎస్ వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు.

అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఏ ఇతర టెలికాం నెట్ వర్క్ లకైనా సరే మీరు అన్లిమిటెడ్ గా వాయిస్ కాలింగ్ మాట్లాడుకోవచ్చు . అలాగే పూర్తి వ్యాలిడిటీతో 300 ఎస్ఎంఎస్ లు కూడా అందివ్వబడతాయి. వీటితోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ మరియు జియో క్లౌడ్ వంటి జియో యాప్ లకు ఉచితంగా యాక్సిస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు చాలా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. అతి తక్కువ ధరకే బెస్ట్ ప్రయోజనాలు అందిస్తున్న జియో కి చాలామంది కనెక్ట్ అవుతున్నారని చెప్పాలి.