Vishnu Priya : విష్ణు ప్రియ ప‌రువు గంగ‌లో క‌లుపుతుంది ఎవ‌రు.. ఆమెకి శ‌త్రువులు ఉన్నారా..!

Vishnu Priya : రోజు రోజుకి బుల్లితెరకు ఎంతో మంది యాంక‌ర్స్ ప‌రిచ‌యం అవుతున్నారు. వారిలో కొంద‌రు త‌మ చ‌లాకీ మాట‌ల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, మరి కొంద‌రు త‌మ అందాలు ఆర‌బోస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియ రూటే సప‌రేటు. తెలుగులో అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ…. పోవే పోరా షోతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. సుడిగాలి సుధీర్ తో కలిసి షో చేసిన ఆమెకి మంచి పాపులారిటీ ద‌క్కేలా చేసింది. అయితే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉండే విష్ణు ప్రియ పూర్తిస్థాయిలో సోషల్ మీడియాని తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ఉప‌యోగించుకుంటుంది.

vishnu-priya-faces-lot-of-problems
vishnu-priya-faces-lot-of-problems

Vishnu Priya : ఎవ‌రు చేస్తున్నారు ఇలా..

నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక డాన్స్ వీడియోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే ఈమె ఇటీవ‌ల త‌న‌కు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది. దేవుడికి ఉన్నంత ఓపిక, సహనం ఉండాలని అలానే అరబిక్ బాయ్ ఫేస్ కట్ తో పాటు చాలా హైట్ ఉండాలి అంటూ తనకు కాబోయే భర్తలో ఉండే క్వాలిటీస్ చెప్పుకొచ్చింది..ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి మగవాళ్ళు బయట ఎక్కడైనా కనపడితే తప్పకుండా ఓకే చెబుతానంటూ కాబోయే భర్త గురించి కామెంట్స్ చేసింది.

ఇక విష్ణు ప్రియ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే.ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. అయితే ఇటీవ‌ల విష్ణు ప్రియ ఫేస్ బుక్ అఫీషియల్ పేజీ నుంచి కొన్ని అశ్లీల‌ వీడియోలు, ఫోటోలు షేర్ కావడం కలకలం రేపింది. అయితే ఎవరో కావాలనే విష్ణు ప్రియ పై పగబెట్టుకొని మరీ ఇలా చేస్తున్నారంటూ వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈమెపై హ్యాకర్స్ మాత్రం అదే విధంగా అటాక్ చేస్తూ ఈమె పేరు పై ఎన్నో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దానిలో అలాంటి వీడియోలు పెడుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. అయితే ఫాలోవర్ల ను పెంచడం కోసం ఇలాంటి డ్రామాకు తెర తీసి మళ్లీ సారీలు చెబుతుందంటూ విమ‌ర్శలు కురిపిస్తున్నారు..