Hansika : హ‌న్సిక మ‌రీ ఇంత డేంజ‌రా.. ఫ్రెండ్‌ని మోసం చేసి ఆమె భ‌ర్త‌ని వివాహం చేసుకోబోతున్న యాపిల్ బ్యూటీ

Hansika: అందంతో పాటు అభిన‌యంతో అంద‌రి మ‌న‌సులు కొల్లగొట్టిన అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక‌. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా త‌మిళం, హిందీ భాష‌ల‌లోనే న‌టిస్తుంది. దేశ‌ముదురు సినిమాతో హ‌న్సిక‌కు తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. కోయి మిల్ గయా, మహా, రోమియో జూలియట్ సినిమాల్లో బాలనటిగా నటించి ఆ త‌ర్వాత హీరోయిన్‌గా మారింది హ‌న్సిక‌. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా నటిస్తుండగానే.. పలువురి హీరోలతో ఈ అమ్మడికి అఫైర్ ఉంద‌ని వార్తలు వచ్చాయి.

hansika-cheated-her-friend
hansika-cheated-her-friend

Hansika : అత‌నికి రెండో పెళ్లా..

శింబుతో ప్రేమ పీకల్లోతుగా మారి.. పెళ్లి ఖాయమని అనుకొనే సమయంలో వారిద్దరు తమ బంధానికి బ్రేకప్ చెప్పారు. అప్పటి నుంచి హన్సిక సింగిల్ స్టేటస్ మెయింటెన్ చేసింది. అయితే రీసెంట్‌గా త‌న‌కి కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసింది హ‌న్సిక‌. తన స్నేహితుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడనుండ‌గా, డిసెంబర్ 4న జైపూర్ లోని ఒక ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. రీసెంట్‌గా వీరిద్ద‌రికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోట్ లో వీరిద్దరూ వెళ్తుండగా ఆ ఫొటోను తీయ‌గా, ఈ ఇద్ద‌రు చాలా చ‌క్క‌గా ఉన్నార‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే హ‌న్సిక చేస‌కోబోయే వ్య‌క్తికి ఇది రెండో పెళ్లి అని తెలుస్తుంది. 2016లో రింకీ బజాజ్‌ను వివాహం చేసుకొన్నాడు సోహెల్ . రింకీ బజాజ్‌కు హన్సిక కామన్ ఫ్రెండ్ కావడంతో వారి మధ్య మంచి కుటుంబ సంబంధాలు ఏర్ప‌డ్డాయి. తన స్నేహితురాలితో సోహెల్ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. ఆ పెళ్లిలో హ‌న్సిక డ్యాన్సులు కూడా చేసింది. అయితే కొన్నాళ్ల‌కు సోహెల్ ఖటురియా, రింకి బజాజ్‌ దాంపత్య జీవితం వైఫల్యం కావడంతో ఇప్పుడు సోహెల్‌ని హ‌న్సిక పెళ్లి చేసుకునేందుకు సిద్ద‌మైంది. ఈ క్రమంలోనే హన్సిక స్నేహితురాలని మోసం చేసిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పెళ్లి అయిన వ్యక్తిని ఏ విధంగా ప్రేమించిందని హన్సిక‌ని ఆడేసుకుంటున్నారు.