Prabhas : Netflix కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్..!

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.. టాలీవుడ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా విడుదల చేసిన మిగతా భాషలలో మాత్రం మంచి కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ వీడియో నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా పోస్ట్ చేస్తూ.. ఇదేం యాక్షన్ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది.. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది.. ఇక మన ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని చూసి ఊరుకుంటారా.!? ఏం చేశారో చూడండి..!

UnsubscribeNetflix, BanNetflix hash tags and Netflix app deleted on Prabhas fans on saaho movie
UnsubscribeNetflix, BanNetflix hash tags and Netflix app deleted on Prabhas fans on saaho movie

ప్రముఖ ఓటీపీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సెగ తగిలింది.. సాహో సినిమాలోని ప్రభాస్ వీడియోను పోస్ట్ చేసిన నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా ఇదేం యాక్షన్ అని వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టింది. దీంతో హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో
UnsubscribeNetflix, BanNetflix అనే హాష్ టాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. తమ ఫోన్లలో నెట్ ఫ్లిక్స్ యాప్ డిలీట్ చేసి ఆ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

నెట్ ఫ్లిక్స్ వంటి భారీ ఓటిటి సంస్థ ఇలా రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా పోస్ట్ పెట్టడం సినీ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ప్రభాస్ రేంజ్ ను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని మూవీ లవర్స్ భావిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ పై ప్రస్తుతం అందరూ గుర్రుగా ఉన్నారు. నెట్ ఫ్లిక్స్ త్వరగా ఈ విషయాన్ని గుర్తించి ప్రభాస్ కు సారీ చెబితే కానీ ఈ యాప్ డిలీట్ చేస్తున్న వారి సంఖ్య తగ్గదు.. మరి దీనిపై నెట్ ఫ్లిక్స్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.