Amazon Smart TV Offers : స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్ అలాగే అమెజాన్ అత్యంత చౌక ధరకే స్మార్ట్ టీవీలను, స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక స్మార్ట్ టీవీ ని కేవలం రూ.9000కే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. 32 అంగుళాలు కలిగిన స్మార్ట్ ఎల్ఈడి టీవీని కస్టమర్లకు అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్లో ఫెస్టివల్ సీజన్ ముగిసిన తర్వాత కూడా ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు ఇంకా అందుబాటులోనే ఉండడం గమనార్హం. మరి ఆ స్మార్ట్ టీవీ ఫీచర్స్, మోడల్ అన్ని ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
కార్బన్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీ ని కేవలం రూ.8,990 కె కొనుగోలు చేయవచ్చు. ఇది బెజల్ లెస్ స్మార్ట్ టీవీ ఇందులో కస్టమర్లకు ఉపయోగపడే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ఎల్ఈడి డిస్ ప్లే ఎంత బ్రైట్ గా ఉంటుందంటే మీరు చూసే విజువల్స్ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. 32 ఇంచెస్ కలిగిన అద్భుతమైన డిస్ప్లే తో పాటు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇన్బిల్ట్ యాప్ స్టోర్, సోనీ లివ్, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో 720 పిక్సెల్ రెజల్యూషన్ తో లభిస్తుంది. అంతేకాదు 60 Hz రిఫ్రెష్ రేట్ తో లభించి.. థియేటర్ అనుభూతిని అందిస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే .. 1 యు ఎస్ బి పోర్ట్, 1 హెచ్డిఎంఐ పోర్ట్ తో పాటు ఇన్బిల్ట్ వైఫై, ఈథర్ నెట్ వంటి కనెక్షన్స్ కూడా ఇందులో కనెక్ట్ చేయబడ్డాయి. ఇక ఎవరైనా ఈ ఎమ్ ఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే నెలకు రూ.430 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. 360 డిగ్రీల వ్యూయింగ్ కెపాసిటీతో ఈ స్మార్ట్ టీవీ పిక్చర్ ను అందిస్తుంది. మొత్తానికి అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందవచ్చు.