Allu Arjun : ఫ్యామిలీతో సౌతాఫ్రికాకి ప‌య‌నమైన అల్లు అర్జున్.. కార‌ణం తెలిసి అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అల్లు అర్జున్. పుష్ప సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. పుష్ప సినిమా దాదాపు 350 కోట్ల వసూళ్లతో ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. దీంతో ‘పుష్ప-2’ (ది రూల్‌) గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాగా, తాజా సమాచారం ప్రకారం ఈ నెల 13 నుంచి బ్యాంకాక్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నట్లు స‌మాచారం. అక్కడి అడవుల్లో భారీ పోరాట ఘట్టాలకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.

allu-arjun-family-tour
allu-arjun-family-tour

Allu Arjun : ఎందుకో తెలుసా?

త‌న సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి కొంత స‌మ‌యం ప‌క్కాగా కేటాయిస్తాడు. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం లేదంటే ఫ్యామిలీతో షికారుల‌కి వెళ్ల‌డం వంటివి చేస్తుంటాడు. అయితే బ‌న్నీ తన ఫ్యామిలీతో కలిసి గత రాత్రి సౌత్ ఆఫ్రికా బయలుదేరి వెళ్లి న‌ట్టు తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా అంటే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటారు. కాని అది కాద‌ట‌. ఓ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు బన్నీ సౌత్ ఆఫ్రికా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో సౌత్ ఆఫ్రికాలో ఎవరి వెడ్డింగ్ కి వెళ్లారా అనే చర్చ కూడా మొదలైంది.

ఎయిర్ పోర్ట్ లో బన్నీ తన పిల్లలు అర్హ, అయాన్.. సతీమణి అల్లు స్నేహతో కనిపించ‌డంతో ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవలే బన్నీ తన తమ్ముడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ కి హాజరయి సంద‌డి చేసారు. శిరీష్ మాట‌ల‌కు కాస్త ఎమోష‌న‌ల్ కూడా అయ్యారు. పుష్ప చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండ‌గా, ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, అనసూయ భరద్వాజ్‌ ముఖ్యపాత్రల్ని పోషి స్తున్నారు.