Bigg Boss 6 Telugu : ఫైమాని పిచ్చ‌కొట్టుడు కొట్టిన ఇన‌య‌.. ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 6 చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. గ‌త వారం గీతూ ఎలిమినేట్ కావ‌డంతో హౌజ్‌లో కాస్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పోటీత‌త్వం త‌గ్గింద‌నే చెప్పాలి. ఇక సోమ‌వారం నామినేష‌న్స్ వాడివేడిగా సాగ‌గా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కూడా జోరుగా సాగుతుంది. అయితే ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో కొంద‌రు మ‌రింత అగ్రెసివ్ అవుతున్నారు. గ‌త వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్కులో ఇనాయ హద్దులు దాటి ఫిజికల్ అవ్వడం వల్ల కీర్తి చేతి వేలు విర‌గ‌డం మ‌నం చూశాం. ప్ర‌స్తుతం హౌజ్‌లో కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘స్నేక్ vs ల్యాడర్’ గేమ్ న‌డుస్తుంది. ఇందులో ఇనాయ – ఫైమా అయితే కొట్టుకునే రేంజ్ కి వెళ్లారు.

faima-fight-with-inaya-very-intresting
faima-fight-with-inaya-very-intresting

Bigg Boss 6 Telugu :  ఎందుకంత ఫైర్..

బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ అంటే అందరికి గుర్తొచ్చేది ఇనయా.మొదటి నుంచి దూకుడు ఆటతో ఆకట్టుకుంటున్న ఇనయా తన ఎటాకింగ్ మోడ్ తో హౌస్ మెట్స్ కి ఝ‌ల‌క్‌లు ఇస్తూనే ఉంది. టాస్క్ ల విషయంలో ఇనయాతో పోట్లాట జ‌రుగుతూనే ఉంది. హౌస్ లో ఉన్న వారంతా ఒక వైపు ఇనయా ఒక్కతే ఒకవైపు అనేలా ఆమె గేమ్ ఆడుతుంది. కొందరేమో కానీ ఒక కేటగిరి వాళ్లైతే ఇనయా కి తెగ ఓట్లు వేస్తున్నారు.మరోపక్క ఇనయా ఇన్నాళ్లు ఫ్రెండ్ అనుకున్న ఫైమా తో గొడ‌వ ప‌డ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టాస్కులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మట్టిని ఎటాక్ చేసి దొంగలించొచ్చు..అలా ఫైమా మరియు ఇనాయ మధ్య పెద్ద యుద్ధమే జరగ‌గా, తోటి ఇంటి సభ్యులెవ్వరు కూడా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయలేకపోయారు. నామినేషన్స్ లో ఎలాంటి గొడవలు జ‌రిగాయో మన అందరం చూసాము.. ఇప్పుడు ఫిజిక‌ల్ టాస్క్ రావ‌డంతో ఇక కొట్టుకున్నంత ప‌ని చేశారు. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ అడ్డు వచ్చాయి కాబట్టి సరిపోయింది..లేకపోతే వీళ్లిద్దరు నిజంగా కొట్టుకుంటారా అని అనిపిస్తుంది. ఇన‌య అగ్రెసివ్ గేమ్‌తో బిగ్ బాస్ గేమ్ నుండి ఎలిమినేట్ చేశారు. ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయిన ఇనయా మళ్ళీ తిండి తినకుండా.. బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఏడ్చేసింది.