Business Idea : ఇటీవల కాలంలో చాలామంది యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యవసాయం చేయాలి అంటే పెట్టుబడితోపాటు వ్యవసాయానికి అనుకూలమైన నేల, నీరు అన్ని సవ్యంగా ఉండాలి. అప్పుడే వ్యవసాయం లో ఊహించని విధంగా లాభాలను పొందవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక బిజినెస్ గురించి మీకు అవగాహన లేకపోయినా సరే పెట్టుబడి లేకుండా నీటి సదుపాయం తక్కువ ఉన్నా సరే ఎడారిలో కూడా కాసులు వర్షం కురిపించే ఒక బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ ఐడియాతో ఎటువంటి వారైనా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు.
కలబంద (అలోవెరా) సాగు.. ప్రస్తుతం ఈ కలబందకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగించే మొక్క ఇది. ఇటీవల కాలంలో ఔషధాలను తయారు చేయడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . మెడిసిన్స్ కూడుకొని పేస్ కాస్మెటిక్స్ అలాగే హెయిర్ కాస్మెటిక్స్ వంటి వాటిల్లో కూడా ఎక్కువగా కలబందను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా షాంపూలు , సబ్బులతో పాటు పేస్ క్రీమ్స్ లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో చాలామంది కలబంద సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కలబంద సాగు చేయడానికి మీకు పెద్దగా ఖర్చు ఉండదు.. కానీ లాభం మాత్రం లక్షల్లోనే ఉంటుంది.
మీరు కలబంద సాగు చేపట్టిన తర్వాత మార్కెటింగ్ గురించి అవగాహన ఉండాలి. ముఖ్యంగా మార్కెట్లో ఎక్కడ కలబందకు డిమాండ్ ఉందో తెలుసుకొని అక్కడ మీరు మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మరింత లాభాలు వస్తాయి. ఏడాదికి కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో రూ.10 లక్షల ఆదాయం పొందవచ్చు. మీరు ఎంత ఎక్కువ ఎకరాలలో కలబంద సాగు చేస్తే అంత ఆదాయం మీ సొంతమవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం.. ఒక హెక్టారు సాగుకు రూ.27,500 పెట్టుబడి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక హెక్టార్ కి 50 టన్నుల అలోవెరా ఆకులు ఉత్పత్తి అవుతాయి. ఒక టన్ను అలోవెరా ఆకుల ధర సుమారుగా 25 వేల రూపాయలు పలుకుతోంది. సరాసరి ఒక పంట కాలానికి ఎటు చూసినా రూ. 10 లక్షల ఆదాయం ఉంటుంది. ఎడారిలో కూడా కాసుల వర్షం కురిపించడం అంటే ఇదేనేమో.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వ్యాపారంతో మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి..