NTR : జూనియర్ ఎన్టీఆర్ ,రిషబ్ శెట్టి సినిమా మీద క్లారిటీ ??

NTR : కాంతారా సినిమా లోని సన్నివేశాలు భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం తో రిషబ్ దర్శకత్వ తీరుని అందరు మెచ్చుకుంటున్నారు. కాంతారా కు దర్శకత్వం తో పాటు హీరో గా నటించి అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Clarity on Junior NTR, Rishab Shetty's movie??
Clarity on Junior NTR, Rishab Shetty’s movie??

ఇక వివరాలలోకి వెళ్తే కన్నడ సూపర్ స్టార్ అయిన దివంగత పునీత్ రాజ్ కుమార్ కి అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత పురస్కారం అవార్డు ప్రదానోత్సవం లో జూనియర్ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఆ సమయం లో రిషబ్ శెట్టి , ఎన్టీఆర్ మాట్లాడుకోవడం జరిగింది. ఈ సంఘటన మీడియా దృష్టిలో పడటం తో వీరిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న భారీ పాన్ ఇండియామూవీలో లో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడమే కాదు గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూవస్తున్నాయి.

రిషబ్ శెట్టి , ఎన్టీఆర్ తో సినిమా అంటూ వస్తున్న వార్తలపై ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అని ఆయన అంటే తనకు చాలా అభిమానం,గౌరవం ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.ఆయన తో సినిమా అవకాశం వస్తే తానూ కచ్చితం గా నటిస్తాను అని అన్నారు. అయితే ఇప్పటికి అయితే తనను ఎవరు ఆ విషయం గురించి సంప్రదించడం గాని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనికాని తన దృష్టికి రాలేదని రిషబ్ శెట్టి వివరించారు. అయితే రిషబ్ శెట్టి ,యాంగ్ టైగర్ ఇద్దరు అద్భుతమైన నటులు కావడం తో ఇద్దర్ని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఇక పూనకాలే అంటున్నారు అభిమాలనులు. మా కోరిక తీర్చడానికి అయినా ఇద్దరు కలిసి చేయండి అంటూ అటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరి ఈ అభిమానుల కోరిక ఎప్పటికి తీరుతుందో వేచిచూడాలి.