Hair Tips : మీ జుట్టు పలుచగా ఉందా.!? ఈ పనులు అస్సలు చేయకండి.!

Hair Tips : ప్రతి ఒక్కరికి జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని అనుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్ కారణంగా స్ట్రెస్ ఎక్కువగా ఉంది. జుట్టు త్వరగా ఊడిపోతుంది. పైగా నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా కూడా జుట్టు త్వరగా రాలిపోతుంది. అయితే వీటితోపాటు మనం కొన్ని పొరపాట్లను కూడా చేస్తూ ఉంటాం. వాటిని సరిదిద్దుకుంటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇంతకీ మనం చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Don't do this types of mistakes on hair problems
Don’t do this types of mistakes on hair problems

లాంగ్ హెయిర్ ఉన్నవాళ్లు త్వరగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లు ఎక్కువగా హెయిర్ కలరింగ్ చేసుకోవడం, హెయిర్ డ్రై, ఉపయోగించడం, హెయిర్ స్టైలింగ్ కూడా మానుకోవాలి. షాంపూ చేసిన వెంటనే చాలామంది జుట్టు ఆర పెట్టుకోవడానికి గబగబా జుట్టుని రుద్దుతూ, దువ్వుతూ ఉంటారు. దానివల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది. తల స్నానం చేసిన తర్వాత తల తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు.

మీది ఆయిల్ హెయిర్ అయితే డ్రై హెయిర్ షాంపూలను ఉపయోగించకూడదు. అలాగే మీది డ్రై హెయిర్ అయితే ఆయిల్ హెయిర్ షాంపులను ఉపయోగించకూడదు. మీ స్కాల్ప్ కి తగ్గట్టుగా షాంపూ ని ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రోటీన్, సోయా మిల్క్, గ్లిజరిన్ ఎగ్ ప్రోటీన్ ఉన్నవాటి షాంపూలను ఎంచుకోవాలి. ఇవి అన్ని రకాల స్కాల్ఫ్ కు సెట్ అవుతాయి. వారానికి రెండుసార్లు కచ్చితంగా తలస్నానం చేయాలి. ప్రతిరోజు జుట్టుని దువ్వుకోవాలి. అలాగే జుట్టుకి పెరుగుదలకు 18 రకాల అమైనో ఆసిడ్స్ అవసరం .అందుకని పోషకాహారాన్ని తీసుకోవాలి.