Chiranjeevi : చిరంజీవి అంటే వ‌ణికిపోతున్న హీరోయిన్స్.. అంతలా భ‌య‌పెట్టాడా..!

Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్వ‌యంకృషితో ఈ స్థాయికి చేరుకున్న చిరు ఎంతో మందికి ఇన్సిపిరేష‌న్. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండ‌స్ట్రీకి చాలా మంది హీరోలు వ‌చ్చారు. మెగాస్టార్ స్టైల్, డ్యాన్స్, యాక్ష‌న్, ఇలా ప్ర‌తి ఒక్క‌టి కూడా ఎంతో మంది ఇన్‌స్పైర్ చేసింది. మ‌ధ్య‌లో రాజ‌కీయాల‌లోకి వెళ్లి సినిమాల‌కి కొంత దూరంగా ఉన్న చిరు ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ త‌ర్వాత జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో పలకరించిన చిరంజీవి ఈ మూవీ తో కాస్త నిరాశ‌పరిచారు

heroines-fear-with-heroines
heroines-fear-with-heroines

Chiranjeevi : జంకుతున్న హీరోయిన్స్..

ఇక రీసెంట్‌గా గాడ్ ఫాద‌ర్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన చిరు ఇప్పుడు వాల్తేరు వీర‌య్య చిత్రంతో అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అనంత‌రం వినాయక్‌తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.. రీసెంట్‌గా రామ్ చరణ్ మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకోగా, . ఈ చిత్రాన్ని వినాయక్ చేతిలో పెట్టడానికి ఓకే చెప్పినట్టు టాక్. అయితే చిరు వ‌రుస సినిమాలు అయితే చేస్తున్నాడు కాని ఆయ‌న స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ ఎవ‌ర‌నే దానిపై ఆందోళ‌న నెల‌కొంది. ఒక‌ప్పుడు చిరు సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ అంటే అబ్బా.. అన్న‌ హీరోయిన్స్.. ఇప్పుడు చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తామంటే కాస్త వెనకాడుతున్నారట.

చిరంజీవి పక్కన హీరోయిన్‌గా చేస్తే మళ్ళీ యంగ్ హీరోల పక్కన అవకాశం రాదేమో అని వారిలో భయం ఏర్ప‌డింద‌ట‌. ఇంతకముందు కొంతమంది హీరోయిన్ ఇలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారి సరసన నటించి అడ్రస్ లేకుండా పోవ‌డంతో ఇప్పుడు చిరు ప‌క్క‌న అవ‌కాశం వచ్చిన సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నార‌ట‌. శృతి హాస‌న్ మాత్రం డేర్ చేసి బాల‌య్య‌, చిరుల‌తో క‌లిసి న‌టిస్తుంది. మ‌రి ఈ అమ్మ‌డికి అదృష్టం ఎలా క‌లిసి వ‌స్తుందో చూడాలి