Noel : ఇది నోయ‌ల్ విశ్వ‌రూపం.. అందుకే విడాకులు ఇచ్చాన‌ని చెప్పిన హీరోయిన్

Noel : సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ‌, పెళ్లిళ్లు స‌హజం. అయితే ఎంతో ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న చాలా జంట‌లు కొద్ది రోజుల‌కే అనివార్య కార‌ణాల వ‌ల‌న విడాకులు తీసుకుంటుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. అలాంటి వారిలో సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సేన్ – హీరోయిన్ ఎస్తర్ జంట ఒకటి. అని చెప్పాలి. పెళ్లైన ఆరు నెలలకే విడిపోయిన ఈ జోడీ.. తమ విడాకులకు కారణం ఏంటి అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రివీల్ చేయలేదు. దీంతో ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు ఊహించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోయల్‌ క్యారెక్టర్‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ఇవి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

noel-wife-stunning-comments-vira
noel-wife-stunning-comments-vira

Noel : అలాంటి వాడు కాబ‌ట్టే..

నాకు పెళ్ళైన 16 రోజులకే నోయల్ నిజ స్వరూపం తెలిసింది. దీంతో అతడి నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎంత త్వరగా విడాకులు వస్తే అంత మంచిదని ఎదురు చూశాను. ఇక విడిపోయిన అనంతరం నోయల్ నాపై చాలా దుష్ప్రచారం చేశాడు. న‌లుగురిలో త‌ప్పుగా ప్రోజెక్ట్ చేశాడు. దీంతో నాకు సోషల్ మీడియా వేధింపులు చాలా ఎక్కువ అయ్యాయి. ఒక వ్యక్తి అయితే హైదరాబాద్ లో కనిపిస్తే యాసిడ్ పోస్తా అంటూ బెదిరింపుల‌కి కూడా దిగాడు. బిగ్ బాస్ హౌస్ లో విడాకులను సింపతీ కోసం న‌న్ను వాడుకునే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూసి స‌మాజంలో ఇలాంటి మ‌నుషులు కూడా ఉంటారా అని అనిపించింది. దీనిపై నోయ‌ల్ ఎలా స్పందిస్తాడా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక నోయల్ సీన్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి తనలోని ఎన్నో రకాల టాలెంట్లను బయటపెడుతూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే. సింగ‌ర్‌గా అలరిస్తూనే, యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో ఎన్నో సినిమాలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించి అల‌రించాడు. కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్ వంటి అనేక హిట్ చిత్రాల్లో అల‌రించాడు. రచయితగా, రాప్ సింగర్ గా కూడా నోయల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరోయిన్ ఎస్తర్‌’1000 అబద్దాలు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, సునీల్‌తో కలిసి నటించిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రం మాత్రమే ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది .