Munugode Result : మునుగోడు ఉప ఎన్నికలలో కెసిఆర్ విజయాని కి బీజేపీ అందించిన ఆయుధాలు ఇవే?

Munugode Result : తెలంగాణ మునుగోడు లో హోరా హోరి జరిగిన ఉప ఎన్నిఎన్నికల్లో అధికారపార్టీ అయినా టీఆర్ ఎస్ విజయ శిఖరాలను అందుకుంది. బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి10,309 మెజారిటీతోగెలిచారు. అదే విధం గా వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని నమూనాగా తీసుకుని రాజకీయ పార్టీలు అన్ని తమ అభ్యర్థులగెలుపుకోసం కోసం అన్నివిధాలా పోరాడారు అన్నమాట తక్కువేమీకాదు. ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే చాలా ఖరీదైన ఎన్నికగా దీన్ని అనేక మంది రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

kcr munugode result updates
kcr munugode result updates

ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అబ్యర్ధి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించి తమపవర్ ఏమిటో చూపించాలి అని బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు.ఇది ఇలా ఉండగా ఎన్నికలకు పది రోజుల ముందు ఫామ్ హౌస్ అంశం హైలైట్ అవడంతో అంచనాలు తారుమారు అయ్యాయి అని బీజేపీ నేతలు మొత్తుకుంటున్నారు. తెరాస కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ఢిల్లీకి చెందిన వారు ప్రయత్నించారన్నసంఘటన కూడా మునుగోడు ఉప ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపించింది అని బీజేపీ నాయకులు తమ ఓటమి కారణాల చర్చలోచెప్పినట్టు తెలుస్తుంది. ఫామ్ హౌస్ సంఘటన పలు టీవీ చానెల్స్ లో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలవడం తో ఓటమి చవిచూడవలిసి వచ్చింది అని బీజేపీ నాయకులూ అంటున్నారు.
తెరాస ఈ అంశాన్ని ఉప ఎన్నికలలో గెలవడానికి బాగా వాడుకుంది. దానికి తోడు రైతుల దగ్గర వడ్లు కొనరు గానీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం కోట్ల రూపాయల తో కొనడానికి మాత్రం బీజేపీ ముందు ఉంది అని సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ లుఅదే పనిగా విమర్శలు గుప్పించడం తో అవి ప్రజల మనస్సులో బాగా నాటుకున్నాయి. అంతటితో ఆగని కెసిఆర్ తెలంగాణ బిడ్డలను కొనడం సాధ్యమైయే పనేనా? అంటూ ప్రశ్నిస్తూ చండూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పెరేడ్ చేయడంవలన తెలంగాణ సెంటిమెంటును మరింత బలంగా జనాలలోకి తీసుకువెళ్లడం లో విజయం సాధించారు.

కెసిఆర్ మాటల కు దీటుగా సమాధానం చెప్పడం లో బీజేపీ నేతలు విఫలమయ్యారు అన్న చర్చ అయితే జరుగుతుంది. ఇక తెరాస వారు ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రకటించిన హామీలను బీజేపీ సమర్థవంతంగా తిప్పి కొట్టినా లేదా అంతకు మించి హామీలు గుప్పించినా కూడా ఫలితం వేరుగా ఉండేది అని రాజకీయ విశ్లేషకుల మాట. అలా చేయకపోవడం వలననే కెసిఆర్ కి విజయం దక్కింది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.