YS Vivekananda Reddy : వై ఎస్ వివేకా కేసులో అతిపెద్ద న్యూస్ బయటపడింది – సిద్ధంగా ఉండండి రా సిబిఐ వస్తోంది !

YS Vivekananda Reddy : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిన్న నాంపల్లిలోని సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్లంతా కూడా కడప నుంచి నిన్న హైదరాబాద్ కి వచ్చారు. ఈ నిందితులలో డ్రైవర్ దస్తగిరి, యర్రా గంగిరెడ్డి వీళ్ళిద్దరూ బెయిల్ పై ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళతోపాటు ఉమా శంకర్ రెడ్డి శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వీళ్ళ ముగ్గురు కడప జిల్లాలో రిమాండ్ ఖైదీలు ఉన్నారు. ఈ కేసు విచారణ జరగగా వచ్చేనెల మార్చి 10వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే !?

ఎవరైతే కడప జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వారిని చెంచల్ గుడా జైలుకి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే మల్ల ఎంక్వైరీలు ఉంటాయి కాబట్టి. అయితే కడప నుంచి తీసుకురావడం ప్రతిసారి కష్టమవుతుంది కాబట్టి ఇలా చేశారు. ఓవరాల్ గా ఒక నెల రోజుల నుంచి చూసుకుంటే వైయస్ వివేకానంద కేసు ఊపందుకుందనే చెప్పవచ్చు.

Ys Viveka case another big twist
Ys Viveka case another big twist

ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి ఫోన్ కాల్ డేటా.. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటాలో ఆయన ఎవరెవరికి కాల్ చేశారు. అందులో ముందుగా బయట పడింది నవీన్, కృష్ణమోహన్.. వీళ్ళతోపాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు. ఎంపీ అవినాష్ రెడ్డి ని ఏ విధంగా అయితే విచారణ చేశారో అది కీలకంగా మారనుంది. ఈ కేసులో ప్రధాన 5 గురు నిందితులతో పాటు అవినాష్ రెడ్డి , నవీన్, కృష్ణమోహన్ ఇంకొంతమంది ఎంక్వయిరీ లో ఉన్నారు వాళ్లకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వారి సంఖ్య ఇంకా ఎక్కువ కానుంది.

 

వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి తన తండ్రి కేసులో న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఈ కేసు విచారణ పక్క రాష్ట్రాలలో జరగాలని కోరుకుంది. ఆమె కోరుకున్నట్టే.. ఈ కేసు విచారణ హైదరాబాదులో జరుగుతుంది. ఈ కేసులో మరి కొంత మంది బయటకు రానున్నారని తెలుస్తుంది.