KethiReddy : కేతిరెడ్డి సరికొత్త వీడియో బయటకి వచ్చింది .. అందులో భర్త కోసం కేతిరెడ్డి భార్య ఏం చేసింది అంటే !

KethiReddy ధర్మవరంలోని చౌడేశ్వరి అమ్మవారి శత జ్యోతుల మహోత్సవం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి తో పాటు ఆయన భార్యతో సతీ సమేతంగా విచ్చేశారు. ముందుగా ఆలయంలో దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత జ్యోతులను ఎత్తుకొని ఆలయ ప్రాంగణంలో నడిచారు. అనంతరం ఆ దేవాలయంలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో కేతి రెడ్డి భార్య నడిచారు.. తన భార్య కేతిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే విజయం దక్కాలని నిప్పుల గుండంలో నడుచుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలలో నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరు అంటే ముందుగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరే గుర్తొస్తుంది.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు. లేదంటే అధికారులతో చెప్పి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.

 

ఇలా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. చిన్న, పెద్ద , ముసలి వాళ్లు ఉన్న తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. ఆయన చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Dharmavaram MLA kethireddy venkataramireddy wife excellent work on her husband
Dharmavaram MLA kethireddy venkataramireddy wife excellent work on her husband

బాగున్నావా పెద్దమ్మ.. బాగున్నావా పెద్దాయన.. బావున్నావా అక్క.
ఏరా చిన్న.. ఏం హీరోస్ అని పలకరింపులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జరిగిన ఫన్నీ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే ఎమ్మెల్యే తన ప్రజలతో మాత్రం చాలా సరదాగా గడుపుతారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు . కష్టాల్లో ఉన్నవారికి డబ్బులు ఇచ్చే సాయం చేస్తుంటారు. అదేవిధంగా చిన్న పిల్లలతో చమత్కారాలు సరదాగా నవ్వించడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు.