Abdul Nazeer : ఏపీ రాష్ట్ర గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 రాష్ట్రాల గవర్నర్ల నియామకం చేపట్టారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ను ఛత్తీస్గఢ్ గవర్నర్ గా నియమించారు.. జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు జరిగిన పలు కీలకతీర్పులు వెలువరించారు.. జగన్ కు అడ్డుకట్ట వేయడానికి కొత్త గవర్నర్ ను రంగంలోకి దింపారని తెలుస్తోంది..
2019 జులై 14న బిశ్వ భూషణ్ ఏపీ గవర్నర్ గా నియమితులయ్యారు. జగన్ ప్రభుత్వంతో విభేదాలకు వెళ్లలేదు. ప్రభుత్వం నుంచి ఏ ఫైలు వచ్చినా కూడా దానిమీద పెద్దగా ప్రశ్నించేవారు కాదు.. ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వారికి పూర్తి సానుకూలతను ప్రదర్శించారు. జగన్ ప్రభుత్వంతో గవర్నర్ పూర్తి మమేకమైనట్లు కేంద్రం కూడా గుర్తించింది.. కొందరు ఢిల్లీ పెద్దలు ఈ వైఖరిని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ ఆలోచన విధానాలను పోకడలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందా అన్న సందేహం ద్వారా వ్యక్తం అవుతుంది.
జగన్ దూకుడుకు చెక్ పెట్టడానికే జస్టిస్ అబ్దుల్ నజీర్ నువ్వు గవర్నర్గా నియమించారని రాజకీయ పరిశీలికలు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ విభేదాలకు పోనీ జస్టిస్ నజీర్ అవసరమైనప్పుడు మాత్రం చాలా గట్టిగా వ్యవహరిస్తారని పేరు ఉంది. ఒత్తిళ్లకు లొంగకుండా ఉంటారని న్యాయ వర్గాలు అంటున్నాయి. ఈయన ద్వారా జగన్కు చెక్ పెట్టవచ్చని మరి అడ్డగోలుగా వ్యవహరించకుండా నిలువరించే ఆలోచనతోనే గవర్నర్ గా ఎంచుకున్నారని చెబుతున్నారు.
మూడు రాజధానుల బిల్లును విశ్వ భూషణ్ కళ్ళు మూసుకుని ఆమోదం తెలిపారని ఆరోపణలు ఉన్నాయి. అనేక సార్లు కోర్టుమెంటు లెక్కిన అనేక బిల్లులు గవర్నర్ విశ్లేషించకుండానే ఆమోదం తెలిపారని వాదన కూడా ఉంది. రాష్ట్రంలో ఏం జరిగినా ఎస్ అంటున్నారు ప్రభుత్వంలో తప్పు జరిగితే ఎత్తి చూపించాలి. విధానాల్లో లోపాలు ప్రతిపాదనలో తప్పు ఉంటే గవర్నర్ వెనక్కి తిప్పి పంపించాలి. ఇలా చేయలేదు కాబట్టే.. నూతన జస్టిస్ ను కేంద్రం నియామకం చేసిందని.. జస్టిస్ అబ్దుల్ నజీర్ తో జగన్ కు చెక్ పెట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.