Weight Loss : బరువు పెరగడం చాలా సులువు. కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టమని బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి స్పష్టంగా అర్థమవుతుంది. బరువు తగ్గడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించకుండా ఇంట్లోనే చక్కటి డ్రింక్ తయారు చేసుకొని తాగాలి. ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు చూద్దాం అలాగే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బరువు త్వరగా తగ్గుతారో కూడా తెలుసుకుందాం..
డ్రింక్ తయారు చేసుకునే విధానం..
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నిండా నీళ్లు పోసి ఒక చెంచా పసుపు వేయాలి. ఒక చెంచా చొప్పున మిరియాలు, వాము, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పది ఆకులు తులసి, చిన్న అల్లం ముక్క వేసి ఒక 15 నిమిషాలు పాటు మరిగించుకోవాలి. ఈ నీరు బాగా కాగిన తర్వాత వడపోసుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనే కలుపుకోవాలి.
ఇది కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఒక గ్లాస్ నీటిలో చెంచా ఆవు నెయ్యి కలిపి తాగి తే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆసనాలు వేస్తే బెల్లీ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది.
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఎక్సర్సైజెస్ చేయాలి. ముందుగా వామప్ ఎక్ససైజ్ చేయాలి. ఆ తర్వాత పొట్ట మీద ప్రెజర్ పడేలాగా ఆసనాలు వేయాలి. అందులో బాగాంగా చక్తి చాలా ఆసనం, పవర్ ముక్తా ఆసనం, ప్లాంక్ ఆసనాలు, కెచరి ముద్ర వేయాలి. ఈ డ్రింక్ తాగి అలాగే ఈ ఆసనాలు వేస్తే.. త్వరగా వెయిట్ లాస్ అవుతారు.