Youth Tips : మన దేశ సంసృతి లో సంప్రదాయంలో విడాకులు అనే మాట లేదు. చావో రేవో ఒకసారి పెళ్లి అయ్యాక అంతే.. ఆమె నీ మాట వినకపోతే నువ్వు అదృష్టవంతుడివి నీకు వైరాగ్యం వస్తుంది.. ఆమె నీ మాట వింటుందా నువ్వు అదృష్టవంతుడివి ఆమెతో కలిసి అనేక ధర్మ కార్యాలు చేయవచ్చు కానీ ఆమెను వదిలేస్తున్నాను అని అనకూడదు. అందుకే మన సంస్కృతిలో విడాకులు అనే మాట లేదు.
భార్య చేయకూడని తప్పు చేసినా ఆమెను త్యజించకూడదు. ఎంత కోపంగా ఉన్నా కూడా పురుషులు తమని తాము నిగ్రహించుకునేవాళ్లు ఉత్తమ పురుషులు. గౌతముడు తన భార్య విషయంలో కూడా ధర్మమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి తన కోపాన్ని తాను నిగ్రహించుకోవడమే.
భార్య తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్ది తను ఉన్నతమైన మార్గంలో నడిచేలాగా చూడవలసిన బాధ్యత భర్త ది. అలా ఆ బాధ్యత ను భర్త తీసుకుంటే గౌతముడు అంతటి వాడు అవుతాడు. తను తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది.. అందుకు కారణాలేంటి.. గ్రహించి ఆ తప్పు మరొకసారి చేయకుండా ఉండడానికి ఏం చేయాలో సలహా ఇవ్వాలి. అంతేగాని తనకి కోపం వచ్చింది కాబట్టి నిగ్రహం కోల్పోయి మాట్లాడకూడదు. అది మహాత్ముల యొక్క లక్షణం.
భార్యలో ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన తనని విడిచి పెట్టేస్తాను అని అనకూడదు. అసలు ఆడవాళ్ళకి పెద్ద శిక్ష ఏమిటి అంటే భర్త మనసులో స్థానం నుంచి జారిపోకూడదు. ఏ స్థానం భర్త ఇస్తాడు ఆ స్థానాన్ని చేజార్చుకోకూడదు ఏ భార్య అయినా కూడా.. అలా తన స్థానాన్ని దిగజార్చుకుంటున్నా కూడా తన భార్యని ఉద్ధరించే వాడే అసలైన భర్త.