Chammak Chandra :జబర్దస్త్ షోలోకి వచ్చేవారు వస్తూనే ఉంటారు. పోయేవారు పోతూనే ఉంటారు. జబర్దస్త్ మళ్లీమళ్లీ చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్స్ లో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. అప్పటికే చమ్మక్ చంద్ర స్కిట్లు టాప్ రేటింగ్ లో ఉండేవి.. అయితే తన స్కిట్స్ తో ఫేమస్ అయినా సత్య శ్రీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు చమ్మక్ చంద్ర..
చంద్ర టీంలో అంతకుముందు లేడీ గెటప్ లు ఉండేవాళ్ళు.. లేదంటే చంద్రనే ఆడవేషం వేసుకొని కనిపించరు. కానీ ఒక్కసారి సత్య శ్రీ ఎంట్రీ ఇచ్చాక టీం మరింతగా మారిపోయింది.. సత్యా కామెడీ టైమింగ్ , ఇద్దరి కోఆర్డినేషన్ బాగానే క్లిక్ అయ్యాయి. అలా చమ్మక్ చంద్ర సత్య శ్రీలు కలిసి బాగానే స్కిట్లు నడిపించారు. జబర్దస్త్ స్టేజ్ మీద సత్య శ్రీ చమ్మక్ చంద్ర జోడి అందరినీ మెప్పించింది.
సత్య శ్రీ తన టీమ్ లోకి రావడానికి ప్రధాన కారణం వినోద్ డ్రా బ్యాక్.. అంతకుముందు సత్య శ్రీ నా స్కిట్ లో రెండు మూడు సార్లు చేసింది. వినోద్ కి తన హౌస్ ఓనర్ తో గొడవలు అవ్వడం వల్ల కొన్ని రోజులపాటు తను స్కిట్లో నటించలేకపోయాడు. అప్పుడే సత్య శ్రీ నేను కలిసి స్కిట్లు చేసాము. అవి బాగా క్లిక్ అయ్యాయి. దాంతో మేము ఇద్దరం సంవత్సరంనరపాటు కలిసి ఎన్నో స్కిట్స్ చేశాము. అవి బాగా క్లిక్ అయ్యాయని చమ్మక్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
చమ్మక్ చంద్ర కి డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమట. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద ఆ కోరికను కూడా తీర్చేసుకున్నానని చమ్మక్ చంద్ర చెప్పారు. జబర్దస్త్ స్కిట్లు వేసే ముందు ఇంట్రడక్షన్ సాంగ్ చేసే వాడినని అలా సత్య శ్రీ నేను కలిసి చేసిన ఇంట్రడక్షన్ సాంగ్లు కూడా చాలా బాగా హీట్ అయ్యాయని చమ్మక్ చంద్ర చెప్పరు. దాంతో తను చేసిన స్కిట్లతోపాటు తనతో కలిసి డాన్స్ చేయడం తో కూడా నా కోరిక తీరిందని చెప్పారు చమ్మక్ చంద్ర.