RaghuRama Krishnamraju : వైయస్ వివేకానంద రెడ్డి ప్రాణాలు తీసిన కేసులు సిబిఐ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే అనేక దఫాలుగా విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు.. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు.. తాజాగా ఈ విషయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో స్పందించారు.
వైయస్ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని తనతో పాటు తన తండ్రిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని.. ఒకవేళ వీళ్ళిద్దరిని అరెస్టు చేయొచ్చని.. చెయ్యకపోను కూడా ఉండవచ్చు అని చేస్తే కూడా వాళ్ళు ఎలా బయటికి రావాలో కూడా ముందే పక్కాగా వ్యూహం రచించుకొని ఉంటారని.. అందుకు సీఎం జగన్ కావలసిన మద్దతుని కూడా ఇస్తారని అన్నారు. అరెస్ట్ అయినా వారికి ఆరోగ్యం బాగోలేదని లేదంటే మరి ఏదైనా అత్యవసర కారణాన్ని సృష్టించుకుని బయటకు వచ్చేస్తారని రఘురామ అన్నారు.
వైయస్ వివేకాను గొడ్డలితో చంపిన కథను మరోసారి గుర్తు చేశారు. మేము చేశాము అనడము తప్పు. లేదంటే చేశామని సృష్టించడం తప్పు అని సజ్జల అనొచ్చు అని గుర్తు చేశారు. శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కానీ నిరూపించారు అనుకోండి వీళ్లంతా బయటకు వచ్చేస్తారు కదా.. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేసేది సిబిఐ కనుక సాక్షి యాజమాన్యం కాదు. కనుక సిబిఐ ఇన్వేసిటిగేషన్ చేస్తున్న సమయంలో మిగతా వాళ్ళు ఎవరు ఏమి చేయలేరు కనుక.. అందువలన వీళ్ళని అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని నాకు తెలిసిన సన్నిహితులు చెప్పారు అని రఘురామ అన్నారు.
ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినా కూడా మనందరం కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. కొంతమంది వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే మేము కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తామని చెప్పారు. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ అయినా కూడా పది నుంచి నెల రోజుల లోపే కచ్చితంగా బయటికి వచ్చేయడం ఖాయం. కాబట్టి అరెస్టు అనేది జరగొచ్చు అని మనం మెంటల్ గా ప్రిపేర్ అయితే బెటర్ అని రఘురామా అన్నారు. అంతిమంగా న్యాయం జరుగుతుందని అన్నారు.