Balagam movie : దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా బలగం.. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం తదితరలుతో ఈ సినిమా నిన్న మార్చి 3వ తారీఖున థియేటర్స్ లో విడుదల అయింది. ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ జర్నలిస్టు గడ్డం సతీష్ ఈ బలగం సినిమా కథ నాదేనని మీడియా ముందు చెప్పారు. కాగా ఈ విషయంపై డైరెక్టర్ వేణు స్పందించారు..
ప్రముఖ తెలంగాణ దినపత్రిక నవ తెలంగాణలో పనిచేసే జర్నలిస్టు గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని.. ఈ కథను నేను 2011 డిసెంబర్ 24వ తేదీన నవ తెలంగాణలో పచ్చికి అనే పేరుతో ఆదివారం మ్యాగజైన్ లో రాసానని.. ఇప్పుడు అదే కథ తీసుకుని కొచెం మార్పులు చేర్పులు చేసి.. ఆ కథ కి కమర్షియల్ హంగులు అద్ది బలగం సినిమాగా మార్కెట్ లోకి వదిలి దిల్ రాజు తన జేబులో డబ్బులు వేసుకుంటున్నాడు అని తెలిపాడు.
అయితే ఈ సినిమా దర్శకుడు రచయిత అయిన వేణు ఎల్దండి ఆ మాటలను కొట్టి పారేశారు. ఎందుకంటే ఈ సినిమా రచయితను దర్శకుడిని నేనే ఈ విషయంలోకి నిర్మాత దిల్ రాజును తీసుకురావద్దని చెప్పారు. ఈ సినిమా విషయంపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే నన్నే సంప్రదించమని వేణు మీడియా ముఖంగా స్పందించారు. అసలు ఈ సినిమా కథ నాదని అసలు ఆ గడ్డం సతీష్ అనే అతను ఎవరో నాకు తెలియదని పచ్చికి కథను కూడా నేను ఎప్పుడూ వినలేదని అసలు పచ్చికి అనే అంశం లో ఉన్న కథ ఒక తెలంగాణకి మాత్రమే కాదని.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వారికి ఈ అంశం తెలుసని.. నేను అదే అంశాన్ని ఎంచుకొని కథలు రాసుకొని డైరెక్షన్ చేశానని వేణు ఎల్దండి అన్నారు.
ఈయనకు సినిమా డైరెక్టర్ అవకాశం కావాలి అని అనుకుంటే కచ్చితంగా దిల్ రాజు నిర్మాత దగ్గరికి మంచి కథను తీసుకువెళ్తే ఆయన ఆఫర్ ఇస్తారని ఓపెన్ గా చెప్పారు. ఇక ఈ సినిమా కథపై కోర్టులో కేసు వేసుకుంటానని ఆయన అన్నారు. నిరభ్యంతరంగా కోర్టులో కేసు వేసుకోమనండి కోర్టు తీర్పు ప్రకారమే నేను ముందుకు వెళ్తానని వేణు అన్నారు . జర్నలిస్ట్ గడ్డం సతీష్ చేసిన వ్యాఖ్యలను వేణు నవ్వుతూ కొట్టి పారేశారు.