Manchu Manoj: పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్..!

Manchu Manoj.. తాజాగా మంచు మనోజ్.. కర్నూలు దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి , శోభా దంపతుల చిన్న కూతురు మౌనికను వివాహం చేసుకున్న తర్వాత నూతన దంపతులిద్దరూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది.. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని.. ఒకే ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మంచు మనోజ్. అయితే ప్రజాసేవ చేయాలనే కోరిక మాత్రం ఉందన్నారు.. త్వరలోనే వాట్ ద ఫిష్ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా తెలిపారు.

Manchu Manoj & Bhuma Mounika visited Tirumala Tirupati Devasthanam

అంతేకాదు ఒకవేళ మౌనికకు రాజకీయాలలోకి వెళ్ళాలి అని ఆలోచన ఉంటే తాను తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని.. అయితే తనకు మాత్రం ప్రజాసేవ చేయాలని ఆలోచన తప్ప రాజకీయాల్లోకి రావాలని ఆలోచన లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక మౌనిక రెడ్డికి రాజకీయాలేమి కొత్తవేమీ కాదు.. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపులో ఆమె కీలక పాత్ర వహించారు. అలాగే ఆమెకు పలు వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.