Kesineni Nani : టీవి 9 ని దుమ్ముదులిపేసిన కేశినేని నాని..

Kesineni Nani : మీ సొంత పార్టీలోనే మీరు అసంతృప్తిగా ఉన్నారా అని కేశినేని నానిని టీవీ9 ప్రశ్నించగా.. ఎవరు చెప్పారు.. నీకు నేను ఏమైనా ఎప్పుడైనా నీకు చెప్పానా.. ఢిల్లీలో అసంతృప్తిగా ఉన్నారని వాదనలు వినిపించాయి అని చెప్పబోతుండగా.. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.. నేను మీకు ఎప్పుడైనా అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పానా నీకు గాని నీ మీడియా చానల్ కి గాని చెప్పానా.. ఈ టీవీ 9 కు ఎప్పుడైనా చెప్పానా.. మీలాంటి వాళ్ళతో ఇదే పెద్ద ప్రాబ్లం.. అంటూ టీవీ9 మీడియా ప్రతినిధి పై నిప్పులు చెరిగారు కేశినేని నాని..టీవీ9 వాళ్ళు ఏ అజెండాతో ముందుకు వెళ్తున్నారు మీ అజెండా టిడిపిని నష్టపరచడమా.. లేదంటే కేసు లేని నానిని నష్టపరచడమా లేదంటే ఏంటి మీలాంటి వాళ్ళు ఒక ఎజెండాతో ముందుకు వెళ్తారని నాకు తెలుసు.. మీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను..

Kesineni nani counter on TV 9
Kesineni nani counter on TV 9

మీలాంటి మీడియా వాళ్ళు ఊదరగొట్టారని జనాలు ఎవ్వరూ నమ్మరు..మీరు ఏదో టీవీలో చెప్పేస్తే అదంతా నిజం అని ఎవరు నమ్మరు. మీ ఎజెండా ఏంటో అందరికీ తెలుసు.. మీ ఎజెండా ఏంటో నాకు తెలుసు ఇది కూడా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే .. నువ్వు నన్ను డౌన్ చేయాలని చూస్తున్నావ్.. కాబట్టి అందుకే నేను ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. అని కేశినేని అన్నారు . ఆ వెంటనే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ తెలిసినవి నాని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

నాకు చంద్రబాబు నాయుడుకి పడదు అని చెప్తున్నా. అంతకంటే నువ్వేం చెప్పలేవు కదా.. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి. నేనేమైనా ప్రెస్ మీట్ పెట్టి నాకు చంద్రబాబు నాయుడుకి పడట్లేదని.. లేదంటే ఆయనపై నేను హాస్యం తృప్తిగా ఉన్నానని.. లేదంటే టిడిపి పై అసంతృప్తిగా ఉన్నానని మీలో ఎవరికైనా చెప్పనా.. మరి చెప్పనప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతున్నారు. మీరు ఎలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని టీవీ9 ప్రతినిధిని నిలదీశారు కేశినేని నాని. మీరు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్ళాలి. అంతేకానీ ఇలాంటివి చేయకూడదు ఒకవేళ నేను టిడిపితో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం అవుతూనే ఉంటాను. ఇంకొక విషయం వచ్చే ఎలక్షన్లలో నేను పోటీ చేస్తున్నాను అని కేసినేని నాని అన్నారు.