RC15.. ఆర్ ఆర్ ఆర్ వంటి ప్రేస్టేజియస్ ఫిలిం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ సి 15. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కియార అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మొదటిసారి చరణ్ , శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముందుగా ఈ సినిమా రూ.200 కోట్ల బడ్జెట్ అంచనాలతో సెట్ పైకి వెళ్ళింది. అయితే ఈ సినిమా కోసం మినిమం రెమ్యునరేషన్ తీసుకున్న శంకర్ ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు అనేది సమాచారం.
అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ పెంచేయడంతో పాటు ఇతరత్రా సమస్యల కారణంగా బడ్జెట్ చేతులు దాటిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జి స్టూడియోస్ లో పార్ట్నర్ గా చేరిన దిల్ రాజు సినిమా థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు బడ్జెట్ భారీగా పెరగడంతో చేతులెత్తే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు. బడ్జెట్ చూసి శంకర్ రేంజ్కి దిల్ రాజు మైండ్ బ్లాక్ అయినట్లు తెలుస్తోంది.