TDP : టీడీపీకి సీన్ రివర్సవుతోందా ?

TDP : హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తొలగించిన విషయంలో టీడీపీకి సీన్ రివర్సవుతున్నట్లుంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు ఖాయం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో అధికారపార్టీకి మెజారిటి ఉందికాబట్టి సులభంగానే తీర్మానాలు ఆమోదం లభించేసింది. అయితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రాష్ట్రంలో రచ్చ చేద్దామని, భూకంపాలు సృష్టించేయాలని చంద్రబాబునాయుడు అండ్ కో తోపాటు ఎల్లోమీడియా చేసిన ప్రయత్నాలను ఎవరు పట్టించుకోలేదు.

ఎవరు పట్టించుకోకపోగా సీన్ రివర్సవుతోంది. ఎలాగంటే ఎన్టీయార్ అభిమానసంఘాలు చంద్రబాబు, లోకేష్ పైన విరుచుకుపడుతున్నాయి. ఇదే సమయంలో మంత్రులు, మాజీమంత్రులు, సీనియర్ నేతలతో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యింది. 1995లో ఎన్టీయార్ ను అల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు+ఎన్టీయార్ సంతానం కలిపి వెన్నుపోటు పొడిచిన ఘట్టాలను జనాలకు గుర్తుచేస్తోంది.

Is the scene reversing for TDP
Is the scene reversing for TDP

ఎన్టీయార్ కు ఏది అవమానం అంటు పదే పదే అప్పటి ఘటనలను ప్రచారంలోకి తీసుకొస్తోంది. హోటల్ ముందు ఎన్టీయార్ ను సీఎం పదవిలో నుండి దింపేసింది, పార్టీని లాగేసుకోవటం, చెప్పులతో కొట్టించిన ఘటనలను జనాలకు గుర్తుచేస్తోంది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీయాయర్ ను తమ్ముళ్ళు కెలకటం కూడా పెద్ద సమస్యగా మారింది.

ప్రభుత్వం చేసిన పనినచ్చకపోతే చంద్రబాబు అండ్ కో డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఎటాక్ చేస్తుండాలి. అంతేకానీ తాము అనుకున్నపద్దతిలో జగన్ కు వ్యతిరేకంగా ట్వీట్ పెద్దలేదన్న ఆక్రోశంతో జూనియర్ ను కూడా తమ్ముళ్ళు ర్యాగింగ్ చేశారు. దాంతో ఒళ్ళుమండిన జూనియర్ అభిమానులు చంద్రబాబు, లోకేష్ ను గట్టిగా తగులుకున్నారు. తండ్రీ, కొడుకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా, యూట్యూబ్ లో వాయించేస్తున్నారు. దాంతో ప్రభుత్వం నుండి ఎదురుదాడి, జనాల్లో పెద్దగా స్పందన లేకపోవటం, జూనియర్ అభిమానుల రివర్సు వాయింపుడు, బాలకృష్ణ చేసిన ట్వీట్ పై వ్యతిరేకత అన్నీ కలిపి టీడీపీకి సీన్ రివర్సవుతున్నట్లే ఉంది. మరి ముందు ముందు జగన్ను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను అమలుచేస్తారో చూడల్సిందే.