ys jagan : విషయం పూర్తిగా డైవర్టయిపోతోందా ?

ys jagan : విషయం ఏమిటంటే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం. చాల సింపుల్ అండ్ స్ట్రైట్. అసెంబ్లీ, శాసనమండలిలో మెజారిటి వుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లుగా తీర్మానం అయిపోయింది. ఇంకేముంది హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరుపోయి డాక్టర్ వైఎస్సార్ పేరు వచ్చేసినట్లే. అయితే అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది. అదేమిటంటే పేరు మార్పు విషయం పూర్తిగా పక్కకుపోయి సంబంధంలేని అంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఇపుడు బయటకు వస్తున్నాయి.

పేరుమార్పు విషయంలో చంద్రబాబునాయుడు, లోకేష్, తమ్ముళ్ళు+ఎల్లోమీడియా చేస్తున్న రచ్చకు వైసీపీ నుండి అధికారప్రతినిధులు, సోషల్ మీడియా కౌంటర్లుస్తునే ఉంది. ఇదే సమయంలో ఎన్టీయార్ కొడుకు బాలకృష్ణ ఘాటుగా ఒక ట్వీట్ పెట్టారు. దానికి కౌంటరుగా మంత్రి జోగిరమేష్ ఇంకా ఘాటుగా సమాధానమిచ్చారు. ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినపుడు వారసులంతా పక్కనే ఉన్నది నిజం కాదా అంటు నిలదీశారు.

ys jagan :Is the subject completely diverted?
ys jagan :Is the subject completely diverted?

వారసులు, కుటుంబసభ్యులు+ఎల్లోమీడియా అంతా కలిసే కదా ఎన్టీయార్ ను సీఎంగా దింపేసి, పార్టీ లాగేసుకుని మానసిక క్షోభతో చనిపోవటానికి కారణమైదంటు రెచ్చిపోయారు. సినిమాల్లో పౌరుషం చూపించే సత్తా నిజంగానే బాలయ్యకుంటే, బాలయ్య నిజంగా ఎన్టీయార్ కొడుకే అయితే పార్టీని చంద్రబాబు దగ్గర నుండి లాగేసుకోవాలంటు చాలెంజ్ చేశారు. ఎన్టీయార్ చనిపోయేముందు చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో బాలకృష్ణకు తెలీదా ? అంటు నిలదీశారు.

పౌరుషం అంటే జగన్మోహన్ రెడ్డిదే కానీ బాలకృష్ణదో లేకపోతే ఎన్టీయార్ సంతానానిదో కాదని తెగేసిచెప్పారు. హోటల్ దగ్గర రోడ్డుమీద ఎన్టీయార్ ను చంద్రబాబు చెప్పులతో కొట్టించినపుడు పౌరుషం ఏమైందంటు బాలకృష్ణను జోగి గట్టిగా తగులుకున్నారు. వైసీపీ-టీడీపీ మధ్య జరుగుతున్న తాజా గొడవంతా చూసిన తర్వాత విషయం పూర్తిగా డైవర్టయిపోయిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి అసలు విషయం ఇంకెప్పుడు చర్చకు వస్తుంది ? లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కు ఎప్పుడు శుభం కార్డు పడుతుంది ? అన్నదే మామూలు జనాలకు అర్ధం కావటంలేదు.