Black Tumeric : మన హిందూ సంప్రదాయంలో పసుపుకి ఎంతో ప్రాధాన్యత వుంది. పసుపు వల్ల శుభమే కాక, అందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. కానీ పసుపులో నల్ల పసుపు రకం గురుంచి ఎప్పుడైనా విన్నారా.. నల్ల పసుపు ఇందులో కూడా మామూలు పసుపు కంటే ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో ఔషద గుణాలు పుష్కళంగా లభిస్తాయి .అందుకే తప్పనిసరిగా మనం ఆహారంలో చేర్చుకోవాలి.ఈ నల్ల పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా అలాగే యాంటీ మైక్రోబ్ లక్షణాలు అధికంగా లభిస్తాయి.కావున నల్ల పసుపు వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జలుబు, దగ్గుతో ఎక్కువగా బాధపడుతున్నప్పుడు,నల్ల పసుపు వేడి నీటిలో వేసి ఆవిరి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులతో బాధపడేవారు గోరువెచ్చని పాలలో నల్ల పసుపు వేసుకొని త్రాగటం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వాటికీ తొందరగా నయం అయేలా చేస్తాయి. పీరియడ్స్ సమయంలో స్త్రీలకు నొప్పి ఇంకా తిమ్మిరి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు నల్ల పసుపును వేడి పాలల్లో వేసుకొని తీసుకుంటే, కడుపు నొప్పి ఇంకా అలాగే తిమ్మిరి సమస్య నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
ఇంకా ఇది గాయాలను తొందరగా మాన్పడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే నల్ల పసుపులో యాంటీ-ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా లభిస్తాయి. ఈ గుణాలు ఉండటం వల్ల గాయాలను తొందరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడానికి నల్ల పసుపు చాలా బాగా సహాయపడుతుంది . ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండటం వలన దీనిని తరుచుగా మనం ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ బారిన పడిన అవయవాలను రీ కవర్ చేసుకోవడానికి సహాయపడుతుంది .ఇంకా వయసు తో పాటు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, వాపు సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. అలాంటి వారికీ నల్ల పసుపు చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. నల్ల పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కళంగా ఉండటం వల్ల,ఇది నొప్పి ఇంకా వాపును తగ్గించడంలో మంచి సహాయకారి అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు.దీనిని రోజూ ముఖానికి పూసుకోవడం వల్ల మచ్చలు,జిడ్డు తొలగి అందంగా తయారవుతుంది.