Amazon great indian festival sale : పండుగ కంటే ముందే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరిట భారీ తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులను మొదలుకొని గ్రోసరీ ఉత్పత్తుల వరకు కస్టమర్లకు అందించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ వస్తువులపై ముఖ్యంగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీల పై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. ఇకపోతే అతి తక్కువ ధరకే లభించే స్మార్ట్ టీవీ బ్రాండ్ లను కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సాంసంగ్ , ఎల్జి, సోనీ హోమ్ ల నుండి 50 అంగుళాల 4k ఎల్ఈడి టీవీని తక్కువ ధరకే తీసుకురానుంది. ఇక మీరు కూడా పెద్ద సైజు స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
MI 5X SERIES:
ఈ సిరీస్ లో టీవీ ని మీరు 37% తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.. నిజానికి ఈ స్మార్ట్ టీవీ ధర రూ.59,999 కాగా 50 ఇంచుల స్మార్ట్ టీవీ ని మీరు కేవలం రూ.37,999 కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈటీవీలో 40 W ఆడియో అవుట్ పుట్ అందుబాటులో ఉంది. డాల్బీ అట్మాస్ , ఆటో లో లాటెన్సీ మోడ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 60 Hz రీఫ్రెష్ రేటుతో ఈటీవీ మీకు లభిస్తుంది.
SAMSUNG CRYSTAL 4K Series:
ఈ స్మార్ట్ టీవీ ని మీరు అమెజాన్ లో రూ. 41,990కి సొంతం చేసుకోవచ్చు నిజానికి ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.68, 400.. దీనిపై 39% తగ్గింపు లభిస్తోంది. ఈ టీవీ లో HDR 10+ , యుహెచ్డీ, ఆటో గేమ్ మోడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక శాంసంగ్ యొక్క క్రిస్టల్ 4k సిరీస్ 60Hz రీఫ్రేష్ రేట్ తో మరియు బహుళ కనెక్టివిటీ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
LG UP7550:
అమెజాన్లో ఈటీవీ పై 30% డిస్కౌంట్ లభిస్తోంది. నిజానికి ఈ టీవీ అసలు ధర రూ.69,990. ఇక దీనిని అమెజాన్లో మీరు కేవలం రూ. 48,821 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇందులో హెచ్ డి ఆర్ 10 ప్రో మరియు హెచ్ జి ఎల్ హెచ్ డి ఆర్ కి మద్దతు ఇస్తుంది.