YS Jagan : ఈ సారి వైసీపీ అక్కడ ఒడి పోవడం ఖాయం అంటున్న.. ఐప్యాక్ సర్వే? గట్టెక్కాలంటే అది ఒక్కటే మార్గం.

YS Jagan :  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సర్వేల రిపోర్ట్స్ వైసీపీ కి నిద్రలేకుండా చేస్తున్నాయి. అలాంటి ఒక సర్వే ఇపుడు వైసీపీ పెద్దల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళ్తే.. అమరావతి కి కూతవేటు దూరం లో ఉన్న జిల్లాలలో వైసీపీకి మూడు చోట్ల వ్యతిరేక ఫలితం రాబోతుంది అని ఐప్యాక్ సర్వే లో తేలిందట. ఆ సర్వే ఆధారం గా చూస్తే కృష్ణ ,గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి గెలవడం చాలా కష్టమని తెలుస్తుందట. ఈ ఎమ్మెల్యేలు వ్యవహరించే తీరు వల్ల పార్టీకి నష్టం భారీ స్థాయిలో ఉంటుంది అని సర్వే హెచ్చరిస్తోంది. వీరి వల్ల ఆయా నియోజకవర్గాలలో పార్టీ ఘోరం గా దెబ్బ తింటోందని కూడా తెలియవచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వైసీపీ కి చెందిన వారే ఐ ప్యాక్ సర్వే టీం కి ఎమ్మెల్యే ల పని తీరు మీద వ్యతిరేకం గా ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటు జనంలో నుంచి సేకరించిన సమాచారాన్ని కలిపి చూస్తే ఈ మూడు కీలక జిల్లాలలో వైసీపీ కి ప్రమాద హెచ్చరికలు కనబడుతున్నాయి.

ipack survey about ysrcp
ipack survey about ysrcp

సర్వే ఫలితాలకన్నా ముందు నుంచే అధినాయకత్వం ఈ ఎమ్మెల్యేల ను గట్టిగ హెచ్చరిస్తూనే వస్తుంది. పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గడప గడపకు కార్యక్రమం కి వెళ్ళాలి అని, జనం తో కలసి పని చేసి పార్టీకి నష్టం కలగకుండా చూడాలని సూచిస్తునే ఉంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఈ సూచన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా ఉన్న ఫలితం గానే ఇపుడు ఐ ప్యాక్ టీం సర్వేలోషాకింగ్ నిజాలు తెలిసాయి అని అంటున్నారు. ఇక ఇప్పటికైనా మిగిలి ఉన్న అవకాశాన్ని వారు వినియోగించుకోలేకపొతే మాత్రం ఎక్కడ ఎమ్మెల్యేల పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందో అక్కడ వారిని తప్పించి కొత్తవారి కి అవకాశం ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం సిద్ధమవుతుంది అని సమాచారం.

2019 ఎన్నికల్లో ఐ ప్యాక్ టీం వైసీపీగెలవడానికి ఏ విధంగా సర్వేలు చేసి అందించిందో అందరికి తెలిసిందే. అదేవిధం గా ఇపుడు కూడా ఒక నియోజకవర్గానికి ఇరవై మంది కార్యకర్తల చొప్పున ఎంపిక చేసుకుని వారి నుంచి సమాచారం తెలుసుకుంటుంది. అలా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తేమాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు ఇక ఇంటికే పరిమితం కాబోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది.